చర్మం కాంతులీనాలా?

ముఖం, చేతులు, మెడ మెరుపులీనాలనుకుంటున్నారా? ఇంట్లో దొరికే సహజ పదార్థాలతోనూ ఇది సాధ్యమే. అదెలానో చూడండి...

Updated : 21 May 2022 06:42 IST

ముఖం, చేతులు, మెడ మెరుపులీనాలనుకుంటున్నారా? ఇంట్లో దొరికే సహజ పదార్థాలతోనూ ఇది సాధ్యమే. అదెలానో చూడండి...

రటిపండు తొక్కను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వీటిని ఓ గిన్నెలో వేసి రెండు చెంచాల బియ్యం, అరకప్పు నీళ్లు పోసి పొయ్యిపై బాగా ఉడికించాలి. ఈ అన్నాన్ని చల్లార్చి మిక్సీ పట్టి వడకట్టాలి. ఇప్పుడీ గుజ్జుకి చెంచా చొప్పున మొక్కజొన్న పొడి, నిమ్మ రసం, నారింజ రసం, పాలపొడి వేసి బాగా కలపాలి. దీన్ని పొడి సీసాలోకి తీసుకొని ఫ్రిజ్‌లో వారం రోజులు భద్రపరుచు కోవచ్చు. స్నానం చేశాక లేదా ముఖాన్ని శుభ్రపరుచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని లేపనంలా రాసి అరగంట సేపు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగి, కొబ్బరినూనె లేదా ఏదైనా మాయిశ్చరైజర్‌ రాస్తే చాలు. మెడ, చేతులు, మోచేతుల వద్ద కూడా దీంతో నలుపుదనాన్ని పోగొట్టొచ్చు.

ఏం చేస్తాయంటే..

ఈ మిశ్రమంలోని బియ్యం, మొక్కజొన్న పొడి చర్మాన్ని బిగుతుగా చేసి రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తాయి. దీనివల్ల చర్మం మృదుత్వాన్ని సంతరించుకుని కాంతివంతంగా మారుతుంది. నిమ్మ, నారింజలోని విటమిన్‌ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పాలపొడిలో ఉండే విటమిన్లు ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. కంటి చుట్టూ వచ్చే నల్లని వలయాలకూ దీంతో చెక్‌ చెప్పొచ్చు. పిగ్మెంటేషన్‌ మచ్చలు దూరమవుతాయి. రోజూ వేసే ఈ లేపనం వల్ల ముఖం మెరుస్తూ కాంతులీనుతుంది. మరింకెందుకాలస్యం.. ప్రయత్నించి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్