ముఖారవిందానికి లోలాకుల అందం...

ముఖాకృతికి తగిన లోలాకులు అందాన్ని రెట్టింపు చేస్తాయి. సందర్భాన్ని బట్టి, దుస్తులకు తగినట్లు ఎంచుకుంటే మీరే ప్రత్యేక ఆకర్షణగా నిలవొచ్చు. ఎటువంటి ముఖాకృతికైనా నప్పే జుమ్కాలు అవుట్‌ఫిట్స్‌పైనే కాదు, పట్టుచీర, హెవీ వర్క్‌ లెహెంగాలకూ సరైన జోడీ అవుతాయి. ఛోకర్‌ వరకు వచ్చేలా

Published : 16 Aug 2022 01:01 IST

ముఖాకృతికి తగిన లోలాకులు అందాన్ని రెట్టింపు చేస్తాయి. సందర్భాన్ని బట్టి, దుస్తులకు తగినట్లు ఎంచుకుంటే మీరే ప్రత్యేక ఆకర్షణగా నిలవొచ్చు. ఎటువంటి ముఖాకృతికైనా నప్పే జుమ్కాలు అవుట్‌ఫిట్స్‌పైనే కాదు, పట్టుచీర, హెవీ వర్క్‌ లెహెంగాలకూ సరైన జోడీ అవుతాయి. ఛోకర్‌ వరకు వచ్చేలా భుజాలపై జాలువారుతూ, అన్‌కట్‌ డైమండ్స్‌, ముత్యాలు, కుందన్లు పొదిగిన జుమ్కాలు ముఖానికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. ఇక స్టడ్స్‌ లెహెంగాలు, ఫ్యాన్సీ లేదా పట్టుచీరపై రిచ్‌లుక్‌ తెస్తాయి. సాధారణ సందర్భాల్లోనూ దుస్తులకు మ్యాచింగ్‌గా మారతాయి. ఇక మగువల మనసును దోచే చాంద్‌బాలీ అందమైతే చెప్పనక్కర్లేదు. క్రిస్టల్స్‌, ముత్యాలు, రత్నాలు పొదిగి, చిన్నసైజు నుంచి భుజాలవరకు ఊయల్లా ఊగుతుంటాయి. 

ఇయర్‌రింగ్స్‌కు వెనుకవైపు వచ్చే చెంపసరాలు ముఖానికే కాదు, శిరోజాల అలంకరణలోనూ భాగమవుతాయి. లోలాకులకు మ్యాచింగ్‌గా లేదా మిక్స్‌డ్‌ అండ్‌ మ్యాచ్డ్‌గా వీటిని ధరించొచ్చు.

హెవీగా ఉండే ఎమరాల్డ్స్‌ ఛోకర్‌ లేదా సాదా ఛోకర్‌కూ వజ్రాలు, రాళ్లు పొదిగే స్టడ్స్‌ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎలాంటి ముఖానికైనా ఇట్టే నప్పుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్