ఒత్తైన జుట్టుకు కాఫీ..
ఘుమఘుమలాడే చిక్కటి కాఫీలోని కెఫీన్ మనసును ఉత్తేజ పరుస్తుంది. అలాగే నల్లని నిగనిగలాడే ఒత్తైన జుట్టు సొంతమయ్యేలానూ.. చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు.కాఫీపొడి శిరోజాలకు రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేసి, రాలే సమస్యను దూరం చేస్తుంది. కుదుళ్లకు పోషకాలు చేరడానికి దోహదపడుతుంది.
ఘుమఘుమలాడే చిక్కటి కాఫీలోని కెఫీన్ మనసును ఉత్తేజ పరుస్తుంది. అలాగే నల్లని నిగనిగలాడే ఒత్తైన జుట్టు సొంతమయ్యేలానూ.. చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు.
కాఫీపొడి శిరోజాలకు రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేసి, రాలే సమస్యను దూరం చేస్తుంది. కుదుళ్లకు పోషకాలు చేరడానికి దోహదపడుతుంది. జుట్టు ఎదుగుదలలో ఉపయోగపడటమే కాకుండా, తెల్లబడిన శిరోజాలను నల్లగానూ మార్చి, సహజ డైలా పనిచేస్తుంది. కాఫీపొడిలోని డీహైడ్రోటెస్టోస్టెరాన్ (డీహెచ్‌టీ) హార్మోన్ జుట్టు కుదుళ్లకు రక్తాన్ని అందించి, పరిరక్షిస్తుంది. శిరోజాలు చిట్లే సమస్యను పోగొడుతుంది. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును ఒత్తుగా, మృదువుగా మెరిసేలా చేస్తాయి. మాడుకు క్లెన్సింగ్‌లా పనిచేసి శుభ్రపరిచి సూక్ష్మక్రిములు, ఫంగస్ వంటి ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షించి, చుండ్రు సమస్యను దరిచేరనివ్వదు.
లేపనంగా..
చెంచా కాఫీ పొడికి రెండు విటమిన్ ఈ క్యాప్సుల్స్ కలిపి మాడుకు లేపనంలా రాసి అరగంట ఆరనివ్వాలి. గోరు వెచ్చని నీటితో శుభ్రపరిస్తే చాలు. ఒత్తైన జుట్టు సొంతమవుతుంది. చెంచా కాఫీ పొడికి చెంచా కొబ్బరినూనె కలిపి నిద్రపోయే ముందు తలకు రాయాలి. ఉదయాన్నే తలస్నానం చేస్తే చాలు. అలాగే చెంచా కాఫీపొడికి ఆలివ్‌నూనె కలిపి తలకు రాసి పావుగంట మృదువుగా మర్దనా చేయాలి. 45 నిమిషాల తర్వాత చల్లని నీటితో తలస్నానం చేస్తే, శిరోజాలు మృదువుగా మారతాయి.
మయోనైజ్‌తో..
చెంచా చొప్పున కాఫీ పొడి, మయోనైజ్, గ్లిజరిన్ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి శిరోజాల చివర్ల వరకు మృదువుగా లేపనంలా రాయాలి. 45 నిమిషాలు ఆరనిచ్చి రసాయన రహిత షాంపుతో స్నానం చేస్తే చాలు. మయోనైజ్ కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచి, శిరోజాలు చిట్లకుండా సంరక్షిస్తుంది.
పెరుగుతో..
ఒక గిన్నెలో కప్పు పెరుగు, చెంచా కాఫీపొడి, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చాలు. ఈ లేపనం జుట్టుకు కండిషనర్‌లా పనిచేసి మృదువు, మెరుపును తెస్తుంది. అలాగే చెంచా చొప్పున ఆర్గానిక్ ఆముదం, కాఫీపొడి కలిపిన మిశ్రమాన్ని నీటితో తడిపిన శిరోజాలకు లేపనంలా పట్టించాలి. గంట తర్వాత షాంపుతో స్నానం చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.