కురులకు సువాసనలు..
చాలామందిలో తల స్నానం చేసిన మరుసటి రోజే జుట్టు కళావిహీనమవుతుంది. లేదా జిడ్డుగా తయారవుతుంది. దీనికి చుండ్రూ తోడైతే ఒకలాంటి వాసన. ఆరోగ్యంగా కనిపించడంతోపాటు తల సువాసనలూ వెదజల్లాలా? అయితే వీటిని ప్రయత్నించేయండి.
చాలామందిలో తల స్నానం చేసిన మరుసటి రోజే జుట్టు కళావిహీనమవుతుంది. లేదా జిడ్డుగా తయారవుతుంది. దీనికి చుండ్రూ తోడైతే ఒకలాంటి వాసన. ఆరోగ్యంగా కనిపించడంతోపాటు తల సువాసనలూ వెదజల్లాలా? అయితే వీటిని ప్రయత్నించేయండి.
* మల్లె.. అరకప్పు గులాబీనీటికి నాలుగు చుక్కలు వెనీలా ఎక్స్‌ట్రాక్స్, రెండు టేబుల్ స్పూన్ల గ్రేప్‌సీడ్ ఆయిల్, పది చుక్కలు జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్నమంట మీద కొద్దిగా వేడిచేయాలి. చల్లారాక స్ప్రే బాటిల్‌లో పోస్తే సరి. తలస్నానం చేసి, జుట్టు ఆరబెట్టుకున్నాక దీన్ని తలంతా స్ప్రే చేసుకోవాలి. తేలిగ్గా మాడుమీద ఇంకడమే కాదు.. జిడ్డూ ఉండదు. పైగా వెంట్రుకలకు తేమనందించి మెరిసేలానూ చేస్తుంది.
* గులాబీ.. కప్పున్నర గులాబీ నీటికి కొన్ని చుక్కలు చొప్పున మల్లె, నారింజ నూనెల్ని కలపాలి. దీన్నో స్ప్రే బాటిల్‌లో పోసుకుంటే సరి. తలస్నానం చేసి నీరు కారడం ఆగాక తల, వెంట్రుకలకు దీన్ని స్ప్రే చేసుకుంటే చాలు. చుండ్రు, జిడ్డులను దూరం చేస్తుందిది. చిక్కులు తేలిగ్గా వీడేలా చేయడంతోపాటు వెంట్రుకలు మెరవడంలోనూ సాయం చేస్తుంది.
* కలబందతో.. కప్పు నీటికి పావు కప్పు అలొవెరా గుజ్జు, టేబుల్ స్పూను కొబ్బరి నూనె జోడించి బాగా కలపాలి. దీన్ని తలస్నానం చేశాక స్ప్రే చేసుకుంటే.. మాడుపై మృతకణాలను తొలగించడంలో సాయపడుతుంది. దురద, అలర్జీలను దూరం చేయడంతోపాటు కురులు వేగంగా పెరిగేలా, మృదువుగానూ ఉండేలా చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.