చక్కని చర్మానికి చిక్కుడు..

పాలీఫినాల్స్‌ పుష్కలంగా ఉండే దాల్చిన చెక్క చర్మకణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎప్పటికప్పుడు మృతకణాల చోటులో కొత్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగానే కాదు, మృదువుగానూ మారుతుంది. ముడతలను రానివ్వదు. ఉదయం గోరువెచ్చని నీటికి చెంచా మెత్తని దాల్చిన చెక్కపొడిని కలిపి తీసుకుంటే మంచిది. వంటల్లోనూ దీని వినియోగం చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.

Published : 24 Sep 2022 00:33 IST

పెద్ద వయసేమీ లేకుండానే చర్మం ముడతలు పడుతుంటే సరైన ఆహారం తీసుకోకపోవడమే కారణం అంటున్నారు నిపుణులు. పోషకాలతోపాటు కొల్లాజెన్‌, కణాల ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడే ఆహారం రోజూ ప్లేటులో ఉంటే మృదువైన చర్మం సొంతమవుతుందని చెబుతున్నారు.

పాలీఫినాల్స్‌ పుష్కలంగా ఉండే దాల్చిన చెక్క చర్మకణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎప్పటికప్పుడు మృతకణాల చోటులో కొత్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగానే కాదు, మృదువుగానూ మారుతుంది. ముడతలను రానివ్వదు. ఉదయం గోరువెచ్చని నీటికి చెంచా మెత్తని దాల్చిన చెక్కపొడిని కలిపి తీసుకుంటే మంచిది. వంటల్లోనూ దీని వినియోగం చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.

చిక్కుడు.. ప్రొటీన్లు, పీచు పుష్కలంగా ఉండే చిక్కుడు, బీన్స్‌ జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా, వీటిలోని ఐసోఫ్లేవన్స్‌ చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతాయి. పొడిబారకుండా చిక్కుడులోని ఫోలేట్‌ సంరక్షిస్తుంది. వయసుపైబడకుండానే వచ్చే ముడతల సమస్యను ఇది దూరం చేస్తుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తిలోనూ ఉపయోగపడుతుంది. కాపర్‌, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పుట్ట గొడుగులు చర్మమృదుత్వంలో ప్రధానపాత్ర వహించే కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడతాయి.

అల్లం.. ఇందులో వ్యాధినిరోధక శక్తి గుణాలు మెండు. ఇవి చర్మంపై పేరుకొనే బ్యాక్టీరియాను నశింప చేస్తాయి. అల్లం రసానికి సమాన పాళ్లలో తేనె చేర్చి రోజూ ఉదయం తీసుకుంటే యాంటీ బ్యాక్టీరియా, యాంటీఫంగల్‌గా పనిచేసి చర్మాన్ని ముడతలు పడకుండా సంరక్షిస్తుంది. అలాగే ఏ, డీ, ఈ, కే విటమిన్లు పుష్కలంగా, ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే సాల్మన్‌, అవకాడో, వేరుశనగ, నెయ్యి, ఫ్లాక్స్‌ సీడ్స్‌, ఆలివ్‌ నూనె వంటివాటిని ఆహారంలో చేర్చుకుంటే చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే బెర్రీస్‌ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, చర్మానికి కావాల్సిన కొల్లాజెన్‌ను డామేజ్‌ అవకుండా రక్షిస్తాయి. అంతేకాదు, ఆహారంలో చక్కెరను పూర్తిగా దూరంగా ఉంచి, తాజా పండ్లకు చోటిస్తే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్