అందానికి అయిదు నిమిషాలు!

ఉదయాన్నే ముఖాన్ని శుభ్రం చేసుకొని కాస్త మాయిశ్చరైజరో, క్రీమో రాసేస్తాం. ముఖంపై పేరుకొన్న దుమ్మూ, ధూళీ వదులుతాయి. కాస్త తేమ అందుతుంది అంతేగా! సరిపోతుందిగా.. ఇంకేం కావాలి అంటారా? పోషణ కావాలంటున్నారు నిపుణులు.  

Published : 27 Feb 2023 00:18 IST

ఉదయాన్నే ముఖాన్ని శుభ్రం చేసుకొని కాస్త మాయిశ్చరైజరో, క్రీమో రాసేస్తాం. ముఖంపై పేరుకొన్న దుమ్మూ, ధూళీ వదులుతాయి. కాస్త తేమ అందుతుంది అంతేగా! సరిపోతుందిగా.. ఇంకేం కావాలి అంటారా? పోషణ కావాలంటున్నారు నిపుణులు.  

బాగా పండిన బొప్పాయి ముక్కను తీసుకొని మెదపండి. దాంతో ముఖమంతా రాసి మర్దనా చేయండి. దీనిలోని ఎ, సి విటమిన్లు, ఫోలేట్‌, పొటాషియం మొదలైన పోషకాలు మృతకణాలు తొలగించడమే కాదు.. యాక్నేనీ దూరం చేస్తాయి. చర్మరంధ్రాలకు లోతైన పోషణనిస్తాయి.

సమాన పాళ్లలో నువ్వుల నూనె, నెయ్యి తీసుకోవాలి. వీటిల్లో ఉండే ఎ, డి, ఇ, కె విటమిన్లు చర్మకణాలను రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు దద్దుర్లు వంటివి రానీయవు.

ఇ, బి విటమిన్లు ఉండే జొజొబా ఆయిల్‌.. చర్మానికి కావాల్సినంత తేమనీ అందించి చర్మరంధ్రాల్లోని మలినాలను తొలగించి, మృదుత్వాన్నీ తెచ్చిపెడుతుంది.

చెంచా తేనెకు చిటికెడు పసుపు కలిపి రాయండి. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి చర్మం మృదువుగా తయారవుతుంది. కావాల్సినంత తేమా, యాంటీ ఆక్సిడెంట్లూ అందుతాయి. చేయాల్సిందల్లా రోజుకో అయిదు నిమిషాలు కేటాయించడమే!

వీటిల్లో నచ్చిన దాన్ని రోజూ శుభ్రమైన ముఖానికి పట్టించి, అయిదు నిమిషాలు మర్దనా చేస్తే చాలు.. ఆరోగ్యంగా మెరిసే చర్మం మీ సొంతం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్