Akshata Murthy: ఆధునికతకు అద్దం పట్టేలా... అక్షత!

టాప్‌ మోడల్స్‌తో పోటీపడి... అత్యుత్తుమ దుస్తులు ధరించిన వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది ముందు వరుసలో నిలబడ్డారు అక్షతామూర్తి.

Updated : 30 Jul 2023 10:12 IST

టాప్‌ మోడల్స్‌తో పోటీపడి... అత్యుత్తుమ దుస్తులు ధరించిన వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది ముందు వరుసలో నిలబడ్డారు అక్షతామూర్తి.

న్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తెగా, బ్రిటన్‌ ప్రధాని రిషిసునాక్‌ భార్యగానే కాకుండా.. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకొనే అక్షత(akshata murthy) వ్యాపారవేత్తగా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా లండన్‌లో తనదైన ముద్రవేశారు.

‘ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఆమెకి ఆధునిక వస్త్రధారణపై చక్కని అవగాహన ఉంది. అందుకే సరికొత్తగా, హుందాతనంతో కూడిన దుస్తులు ఎంపిక చేసుకుంటారు’అంటూ టాట్లర్‌ మ్యాగజైన్‌ ప్రశంసంలతో ముంచెత్తింది. ఈ మ్యాగజైన్‌ విడుదల చేసిన జాబితాలో స్టార్‌ బిల్‌నై, ప్రిన్సెస్‌ బీట్రైస్‌ భర్త ఎడ్వర్డ్‌ మపెల్లి మోజీ వంటి పేరున్న మోడల్స్‌ ఉన్నారు. వాళ్లందరినీ వెనక్కినెట్టి అక్షతామూర్తి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. అక్షతామూర్తి వస్త్రధారణ ఆధునిక సమాజానికి ఓ ఉదాహరణ అని టాట్లర్‌ మ్యాగజైన్‌ సంపాదకుడు క్యాండ్లర్‌ ప్రశంసించారు. ఈ జాబితాలో కెనడాకి చెందిన యనాపీల్‌, డొమినిక్‌ సెబేగ్‌ మాంటేఫియోర్‌, ఒపేరా గాయని డేనియల్లా డి నీసే తదితరులు కూడా ఉన్నారు. అక్షతామూర్తి అప్పుడప్పుడూ విలాసవంతమైన దుస్తుల్లో కనిపించి ఆశ్చర్యపరుస్తుంటారు. పాఠశాలలో నిర్వహించే ఓ రన్‌ కోసం దాదాపు రూ.60,218 (570 పౌండ్లు) విలువైన చెప్పుల్ని వేసుకోవడంతో ఇటీవల ఆమె వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.47,012 విలువ చేసే బూట్లు, రూ.1,05,670 విలువ చేసే స్కర్ట్‌తో దిగిన ఫొటోలు కొన్నాళ్ల క్రితం వైరల్‌ అయ్యాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్