గులాబీ వన్నె పెదాలిలా!

కాలం ఏదైనా.. పెదాలు పగలడం, పొడిబారడం సహజం. అలాంటి సమస్యలున్నప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

Published : 10 Aug 2023 00:01 IST

కాలం ఏదైనా.. పెదాలు పగలడం, పొడిబారడం సహజం. అలాంటి సమస్యలున్నప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎప్పటికప్పుడు పెదాల మీద మృతకణాలను తొలగించుకోవాలి. అప్పుడే అవి తేమగా ఉంటాయి. దీనికోసం చెంచా పెట్రోలియం జెల్లీలో కాస్త చక్కెర కలిపి పెదాలకు రాసుకోవాలి. కాసేపయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. లేదంటే టూత్‌బ్రష్‌పై కొద్దిగా చక్కెర వేసి పెదాలపై రుద్దినా చాలు. ఇలా వారానికోసారి చేస్తే సరి.

గుప్పెడు గులాబీరేకల్ని మెత్తగా చేసి... దానికి కాస్త కొబ్బరి కోరు, బాదం నూనె చేర్చి... పెదాలకు రాయండి. ఆపై మృదువుగా రుద్దండి. పావుగంటాగి చన్నీళ్లతో కడిగేయండి. ఇలా రోజూ చేస్తుంటే... వారం తిరిగే సరికి పెదాలపై నలుపుదనం పోతుంది.

చెంచా పంచదారలో కాస్త నిమ్మరసం, దాల్చినచెక్క పొడి కలిపి పెదాలకు పూత వేయండి. పావుగంటయ్యాక పాలతో తడుపుతూ, మృదువైన బ్రష్‌తో రుద్దుతూ కడగాలి. ఇలా తరచూ చేస్తుంటే మృతకణాలు తొలగి మృదువుగా మారతాయి.

రెండు చెంచాల గులాబీ రేకల పొడిలో కొద్దిగా చాక్లెట్‌ పొడి, చక్కెర, కొబ్బరినూనె కలిపి పూతలా వేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లటినీళ్లతో కడిగేసుకుంటే పెదాలు పగలకుండా ఉంటాయి. తాజాగా మారతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని