మీలో మెగ్నీషియం ఉందా?

ఎక్కువ మంది ఆడవాళ్లు పనుల హడావుడిలో ఏదో ఒకటి తిని ఆకలి తీర్చుకోవడమే తప్ప ఆహారం మీద ధ్యాసపెట్టడం లేదని సర్వేలు చెబుతున్నాయి. కానీ మగవాళ్లతో పోలిస్తే మనకు మెగ్నీషియం అవసరం చాలా ఎక్కువట. ఇంతకీ ఏయే పదార్థాల్లో మెగ్నీషియం ఉందో, అది చేసే మేలేంటో తెలుసుకుందాం.. 

Published : 04 Feb 2022 00:48 IST

ఎక్కువ మంది ఆడవాళ్లు పనుల హడావుడిలో ఏదో ఒకటి తిని ఆకలి తీర్చుకోవడమే తప్ప ఆహారం మీద ధ్యాసపెట్టడం లేదని సర్వేలు చెబుతున్నాయి. కానీ మగవాళ్లతో పోలిస్తే మనకు మెగ్నీషియం అవసరం చాలా ఎక్కువట. ఇంతకీ ఏయే పదార్థాల్లో మెగ్నీషియం ఉందో, అది చేసే మేలేంటో తెలుసుకుందాం.. 

* గుమ్మడి గింజలు, బచ్చలికూర, బాదంపప్పు, జీడిపప్పు, ఆకుకూరలు, పాలు, డార్క్‌ చాక్లెట్‌, చిక్కుడు, బీన్స్‌, సోయా, అవకాడో పండ్లు, పప్పు దినుసులు, కాయధాన్యాలు, అరటిపండు, సోయాపాలు, కొన్ని రకాల చేపల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.

* శరీర పనితీరులోఈ ధాతువుదే ప్రధాన పాత్ర. మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. అమైనో యాసిడ్స్‌ నుంచి ప్రొటీన్లను రూపొందిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఊబకాయం రాకుండా చేస్తాయి.

* కండరాలు సేదతీరడంలో ఉపయోగపడుతుంది. రక్తపోటును, టైప్‌-2 మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. గుండె పనితీరును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆస్టియోపొరోసిస్‌ వ్యాధిని నివారిస్తుంది. పార్శ్వనొప్పిని తగ్గిస్తుంది. డిప్రెషన్‌తో పోరాడుతుంది.

* గర్భం దాల్చిన సమయంలో మెగ్నీషియం కొరత లేకుండా చూసుకోవాలి. లేదంటే అనేక సమస్యలు తప్పవు. గర్భిణులు రోజుకు 350 మిల్లీగ్రాములు అందేలా చూసుకోవాలి.  మెగ్నీషియంను విటమిన్‌ బి-6 తో కలిపి తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలను నివారించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్