లాభాలు... ఇద్దరికీ!

బిడ్డకు పాలు పట్టడం వల్ల పాపాయి పొట్ట నిండటమే కాకుండా తల్లికీ ఆరోగ్య పరంగా చాలా మంచిది. మరి తల్లీబిడ్డలకు కలిగే మేలేంటో చూద్దామా...

Updated : 25 Feb 2022 05:54 IST

బిడ్డకు పాలు పట్టడం వల్ల పాపాయి పొట్ట నిండటమే కాకుండా తల్లికీ ఆరోగ్య పరంగా చాలా మంచిది. మరి తల్లీబిడ్డలకు కలిగే మేలేంటో చూద్దామా...

బిడ్డకు... రోగనిరోధకత పెరుగుతుంది. ఈ ఇమ్యూనిటీ కాలానుగుణంగా వచ్చే జబ్బుల నుంచి పాపాయిని రక్షిస్తుంది. ముక్కు, చెవి సంబంధ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాదు అలర్జీలు రాకుండా అడ్డుకుంటుంది.

ఆరోగ్యకరమైన బరువు... నెలలు నిండక ముందే బిడ్డ జన్మించినా తల్లి పాలు పట్టడం వల్ల కొన్నిరోజుల్లో ఆ శిశువు క్రమంగా బరువు పెరగడంతో పాటు ఆరోగ్యమూ మెరుగవుతుంది.

ఊబకాయం రాకుండా... తల్లిపాలు తాగిన చిన్నారులు ఊబకాయులుగా మారే ప్రమాదం చాలా తక్కువ. ఎందుకంటే... పోత పాలతో పోలిస్తే తల్లిపాలలో ఇన్సులిన్‌ మోతాదు చాలా తక్కువ. కాబట్టి చిన్నారి ఆరోగ్యంగా ఎదుగుతుంది.

మెదడు అభివృద్ధికి... తల్లిపాలలో అన్ని రకాల ఆవశ్యక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బిడ్డ శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడతాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో మానసిక అభివృద్ధి బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇవే కాకుండా... తల్లిపాలు బిడ్డ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. టీకాలు వేసే ముందు, ఆ తర్వాత పాలు పట్టడం వల్ల పాపాయికి నొప్పి తగ్గుతుంది. ఆమె వెచ్చని స్పర్శతో ఏడుపు ఆపేస్తారు. అమ్మ ఒడిలో ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా, హాయిగా కేరింతలు కొడతారు.

అమ్మకూ లాభాలూ.. పాలిచ్చే తల్లుల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. పాలు పట్టినన్ని రోజులూ తల్లికి నెల సరి రాదు. ఇది సహజ గర్భ నిరోధకంగా పనిచేస్తుంది. పాలు పట్టడం వల్ల అధిక కెలొరీలు ఖర్చవుతాయి. గర్భిణిగా ఉన్నప్పుడు పెరిగిన బరువు పాలు పట్టడం వల్ల క్రమంగా తగ్గిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్