ఔషధ నీళ్లు తాగేయండి!

వేడి పెరుగుతోంది కదా.. టీ, కాఫీలు పక్కన పెట్టేద్దాం! వేసవి సమస్యల నుంచి ఉపశమనం కలిగించి, ఆరోగ్యానికి మేలు చేసే ఈ నీళ్లు తాగేద్దాం...

Published : 11 Apr 2022 02:08 IST

వేడి పెరుగుతోంది కదా.. టీ, కాఫీలు పక్కన పెట్టేద్దాం! వేసవి సమస్యల నుంచి ఉపశమనం కలిగించి, ఆరోగ్యానికి మేలు చేసే ఈ నీళ్లు తాగేద్దాం...

రోజంతా ఉత్సాహంగా: సన్నగా తరిగిన కీరదోస ముక్కలని నీళ్లలో వేసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే తాగండి. ఈ నీళ్లు చర్మాన్ని మెరిసేలా చేయడంతోపాటు, కళ్ల కింద నల్లటి వలయాలు రాకుండా చూస్తాయి. రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. పొట్టని కరిగించి, బరువును తగ్గిస్తాయి.
మంచి నిద్ర కోసం: అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వల్ల చాలామందికి సరిగా నిద్రపట్టదు. అలాంటివాళ్లు జీలకర్ర వేసి మరిగించిన నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. చర్మం నుంచి వ్యర్థాలు కూడా తొలగిపోయి మేను మెరుస్తుంది.  
ఉబ్బరం తగ్గుతుంది: ఈ కాలంలో ఎక్కువ తినలేం. ఒకవేళ తిన్నా... పొట్ట ఉబ్బినట్టుగా ఉంటుంది. దీనికి మంచి పరిష్కారం సోంపు నీళ్లు. ఈ గింజలు వేసి మరిగించిన నీళ్లు పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. నెలసరి కారణంగా వచ్చే నొప్పుల నుంచీ ఉపశమనం కలిగిస్తాయి.
జీర్ణ సమస్యలు రాకుండా: నీళ్లలో కాసిని పుదీనా ఆకులు వేసి రాత్రంతా నానబెట్టి తెల్లారి తాగాలి. ఒత్తిడి నుంచి ఉపశమనంతోపాటు చర్మం కాంతిమంతంగా మారుతుంది. దీనికి కాస్త నిమ్మరసం కూడా కలిపితే అలసట తొలగిపోతుంది.
నొప్పుల నుంచి ఉపశమనం: ఒళ్లు నొప్పులు, తలనొప్పి, రక్తపోటు సమస్యలున్నవాళ్లు అల్లం మరిగించిన నీళ్లను పొద్దునే తాగితే ఉపశమనంగా ఉంటుంది. దీనికి కొద్దిగా నిమ్మరసం, తేనె చేర్చి తీసుకుంటే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్