పెరుగు తింటున్నారా లేదా...

చాలామందికి పెరుగన్నం తినందే భోజనం పూర్తయిందన్న భావన కలగదు. కానీ ఈ తరం అమ్మాయిలు పెరుగును పెద్దగా ఇష్టపడటం లేదు. అసలే తినని వాళ్లూ ఉన్నారు. కానీ పెరుగు శరీరానికి చాలా అవసరం. పెరుగు తింటే ఎన్ని లాభాలో, తినకపోతే ఎన్ని నష్టాలో చూద్దాం..

Published : 03 Jun 2022 00:54 IST

చాలామందికి పెరుగన్నం తినందే భోజనం పూర్తయిందన్న భావన కలగదు. కానీ ఈ తరం అమ్మాయిలు పెరుగును పెద్దగా ఇష్టపడటం లేదు. అసలే తినని వాళ్లూ ఉన్నారు. కానీ పెరుగు శరీరానికి చాలా అవసరం. పెరుగు తింటే ఎన్ని లాభాలో, తినకపోతే ఎన్ని నష్టాలో చూద్దాం..

నెలసరిలో అమ్మాయిలు బలహీనంగా ఉంటారు. అప్పుడు పెరుగు తప్పక తినాలి.

* ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, భాస్వరం, విటమిన్‌ బి-12, ప్రొటీన్లు ఉన్నందున ఇది మంచి పోషకాహారం. విటమిన్‌ డెఫిషియెన్సీ సమస్య తలెత్తదు. పెరుగు కంటే మజ్జిగ చేసుకుని తాగితే మరింత మంచిది.

* యూరినరీ ఇన్ఫెక్షన్లకు ఇది ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఈస్ట్‌ నోటిపూతను తగ్గిస్తుంది.

* ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది. చర్మానికి కాంతి తెస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణ ప్రక్రియను వృద్ధి చేసి మలబద్ధకాన్ని అరికడుతుంది. నిద్రలేమి సమస్యను నివారిస్తుంది.

* పెరుగు సహించని వాళ్లు కొత్తిమీర, అల్లం మొదలైనవి వేసి మజ్జిగ చేసుకోవచ్చు. తేనె లేదా స్ట్రాబెర్రీ వేసుకుని తినొచ్చు. పెరుగుతో గుండె జబ్బును, మధుమేహాన్నీ అరికడుతుంది. ఊబకాయులు పాలు తగ్గించి పెరుగు వాడటం వల్ల ఫలితం ఉంటుంది.

* రోగనిరోధక శక్తిని పెంచుతుంది కనుక అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. పెరుగు తినని వాళ్లలో రక్తపోటు ఎక్కువని, అలాగే ఇన్సులిన్‌ శాతం కూడా తక్కువగా ఉంటోందని పరిశోధనల్లో తేలింది.

* పెరుగును ఫేస్‌ ప్యాక్‌గా వేసి అరగంట తర్వాత కడిగితే ముఖం మెరుపులీనుతుంది. తలకు కండిషనర్‌గా వాడటం వల్ల జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతాయి.

* సొర, బీర మొదలైన కూరల్లో రుచి కోసం పెరుగు వేస్తారు. పెరుగుతో బంగాళాదుంప కుర్మా చేస్తారు. దీంతో చేసే పచ్చళ్లూ ఉన్నాయి. దద్దోజనం, మజ్జిగ చారుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా! ఏ కూరలూ సిద్ధంగా లేవంటే కాస్తంత పెరుగన్నం తిన్నా కడుపులో దండిగా ఉంటుంది. అందువల్ల ఏదో రూపంలో పెరుగు తప్పక తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్