బరువు తగ్గించే బ్రౌన్‌రైస్‌

కొందరు మూడు పూటలా అన్నం తినకుండా ఉండలేరు. అలాగని దాన్నే తింటే బరువు, కెలొరీలూ పెరిగిపోతాయనే భయం. ఇలాంటి పరిస్థితే మీది కూడానా! ప్రత్యామ్నాయంగా బ్రౌన్‌రైస్‌కి ప్రాధాన్యం ఇవ్వండి..

Updated : 19 Jul 2023 05:04 IST

కొందరు మూడు పూటలా అన్నం తినకుండా ఉండలేరు. అలాగని దాన్నే తింటే బరువు, కెలొరీలూ పెరిగిపోతాయనే భయం. ఇలాంటి పరిస్థితే మీది కూడానా! ప్రత్యామ్నాయంగా బ్రౌన్‌రైస్‌కి ప్రాధాన్యం ఇవ్వండి..

మెనోపాజ్‌ వయసులో ఉన్న మహిళలు ఈ బియ్యం తింటే.. ఇందులోని పీచు గుండె కవాటాలు మూసుకుపోకుండా చేస్తుంది.  బరువు అదుపులో ఉంచుతుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.

ఈ బియ్యంలో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ స్థాయులు తక్కువ. కాబట్టి తిన్న తర్వాత చాలా నిదానంగా జీర్ణమవుతాయి. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. కాబట్టి ఈ బియ్యాన్ని మధుమేహులూ తినొచ్చు. ఇక,  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లూ, ఇతర పోషకాలూ.. పెద్దపేగూ, రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశాల్ని తగ్గిస్తాయట.

బ్రౌన్‌రైస్‌లో ఉండే మాంగనీస్‌ శరీరంలోని కొవ్వుని సులువుగా కరిగిస్తుంది. జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. ఇందులోని విటమిన్లూ, ఖనిజాలూ, ఇతర పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. దానివల్ల శరీరంలో పేరుకున్న ఫ్రీరాడికల్స్‌, వ్యర్థాలనూ బయటకు పంపిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని