అమ్మయ్యే వేళ..

మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్న రోజులివి. అయితే గర్భిణిగా ఉన్న సమయంలో ఈ ఒత్తిడి సరికాదంటున్నారు నిపుణులు. ఆ ప్రభావం బిడ్డపై కూడా  పడుతుందట..

Published : 10 Aug 2023 00:01 IST

మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్న రోజులివి. అయితే గర్భిణిగా ఉన్న సమయంలో ఈ ఒత్తిడి సరికాదంటున్నారు నిపుణులు. ఆ ప్రభావం బిడ్డపై కూడా  పడుతుందట..

పోషకాహారం.. పనిలో పడి తిండిని నిర్లక్ష్యం చేయొద్దు. లేదంటే బిడ్డ ఎదుగులపై ప్రభావం పడుతుంది. కాయగూరలు, పండ్లు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే చిక్కుళ్లు, పాలు, మొలకలు, గుడ్లు, నట్స్‌ తప్పక తీసుకోవాలి. బార్లీ, కొబ్బరి నీళ్లు, నిమ్మ కాయ నీళ్లు తాగుతూ ఉంటే డీహైడ్రేషన్‌ దరి చేరదు.

నిద్ర: ఈ సమయంలో కనీసం 8గం. నిద్ర అవసరం. తగినంత నిద్ర లేకపోతే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం లాంటివి జరగొచ్చు. అలసటగా ఉంటే మధ్యాహ్నం ఓ పావుగంట కునుకు తీయండి.

నడవాలి.. ఆఫీసు పనంటేనే ఎక్కువ సేపు కూర్చోవాలి. కానీ పాదాల నొప్పి, వాపు వంటి సమస్యలొస్తాయి. కాబట్టి, మధ్యలో లేచి కొద్దిసేపు నడిస్తే మంచిది. అలాగే శ్రమ కలిగించే వ్యాయామాలు, పనులకి దూరంగా ఉండండి.

అతి వద్దు.. ఎక్కువగా పని చేయొద్దు. ఈ సమయంలో అలసట మంచిది కాదు. దీని కారణంగా ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ఇదీ బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి.. పనిలో ఒత్తిడికి గురి కాకుండా మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. కూర్చున్నా, నిల్చున్నా, శరీర భంగిమను నిటారుగా ఉండేలా చూసుకోండి. పొట్టపై ఒత్తిడి పడదు.

దుస్తులు.. బిగుతుగా ఉండే దుస్తులు ఈ సమయంలో అసౌకర్యం, ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తాయి. శ్వాస ఇబ్బందులూ వస్తాయి. కాబట్టి, సౌకర్యంగా ఉండే వాటికే ప్రాధాన్యమివ్వాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్