ఆనందంలో.. ఆరోగ్యం మరవొద్దు!

పండగలేవైనా మనకు రకరకాల పిండి వంటలు ఉండాల్సిందే! పని, పూజ పేరుతో వేళలు పాటించకపోవడం.. సువాసనలు ఆకర్షించాయనో, ఒక్కరోజుకి ఏమవుతుందిలే అనో అతిగా తినేయడం... మనకి మామూలే! తర్వాతే అనవసరంగా తిన్నానే అన్న అపరాధభావన. అలా అవొద్దంటే..

Updated : 23 Oct 2023 03:44 IST

పండగలేవైనా మనకు రకరకాల పిండి వంటలు ఉండాల్సిందే! పని, పూజ పేరుతో వేళలు పాటించకపోవడం.. సువాసనలు ఆకర్షించాయనో, ఒక్కరోజుకి ఏమవుతుందిలే అనో అతిగా తినేయడం... మనకి మామూలే! తర్వాతే అనవసరంగా తిన్నానే అన్న అపరాధభావన. అలా అవొద్దంటే..

  • పర్వదినాల్లో రోజూ కంటే ఇంకాస్త ముందే మేల్కొంటాం. ఇంటి శుభ్రత, పూజకు అన్నీ సమకూర్చుకోవడం.. వేళకు అన్ని పనులూ పూర్తవ్వాలిగా మరి! ఎంత త్వరగా లేచినా.. ఆరోజుకి అల్పాహారం దాటవేస్తుంటాం. దాంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. ఇక శక్తి ఎలా వస్తుంది? కాబట్టి, పాలల్లో బెల్లం కలుపుకొనో, పండ్లనో తీసుకోండి. లేదంటే కడుపుబ్బరం లాంటివీ రోజంతా వేధిస్తాయి.
  • ఇక మధ్యాహ్నం.. రకరకాల ఆహారపదార్థాలు ఆకర్షిస్తోంటే మనసు ఊరుకోదు కదూ! అన్నింటినీ తినండి. అయితే పరిమాణంపై మాత్రం దృష్టిపెట్టాల్సిందే. ఎంత నచ్చినదైనా తక్కువ మొత్తంలోనే తినాలన్న నిబంధన పెట్టుకుంటే జీర్ణవ్యవస్థపై భారం ఉండదు.
  • పిండి వంటలంటే నూనె, నెయ్యితో కూడుకున్న వ్యవహారం. పెద్ద మొత్తంలో వాడేస్తుంటాం. ఇక తీపి సరేసరి. బెల్లంతో చేసినవైతే పర్లేదు కానీ.. చక్కెరతో చేసినవాటిపై ఓ కన్నేసి ఉంచండి. ఇంకా.. పిండివంటలు చేయడానికి వాడిన నూనె వృథా అవుతుందని మరోసారి వాడొద్దు.
  • పరివారమంతా ఒకచోట చేరతాం. ఐస్‌క్రీమ్‌, కూల్‌డ్రింక్‌లు తప్పదనుకుంటాం. కానీ.. చక్కెరలు, వాటి తయారీలో వాడిన రసాయనాలూ చేటు చేసేవే! బదులుగా పండ్లరసాలు తాగండి. నిమ్మనీటికి చియా విత్తనాలు కలిపి తీసుకుంటే.. త్వరగా ఆహారం జీర్ణమవుతుంది. తేనె కలిపి చేసిన లస్సీ కూడా శరీరానికి మేలు చేస్తుంది.
  • ఇక రాత్రికి.. త్వరగా భోజనం పూర్తిచేయండి. కొద్దిసేపు ఆరుబయట నడవండి. నీటిలో జీలకర్ర, వాము, మెంతులు వేసి మరిగించి పెట్టుకోండి. పడుకోవడానికి గంట ముందు ఓ గ్లాసుడు గోరువెచ్చగా తీసుకుంటే సరి. శరీరంలోని మలినాలను బయటికి పంపడంలో ఇది సాయపడుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్