Vegetables: వీటిని వండకుండా తింటున్నారా...

ఆరోగ్యమనో, రుచికరమనో భావించి కొందరు పచ్చి కూరగాయలు లేదా సగం ఉడికినవి తింటుంటారు. కానీ, కొన్ని పదార్థాలను అలా తింటే అనారోగ్యాల బారిన పడటం తప్పదని హెచ్చరిస్తారు నిపుణులు.

Updated : 20 Dec 2023 08:57 IST

ఆరోగ్యమనో, రుచికరమనో భావించి కొందరు పచ్చి కూరగాయలు లేదా సగం ఉడికినవి తింటుంటారు. కానీ, కొన్ని పదార్థాలను అలా తింటే అనారోగ్యాల బారిన పడటం తప్పదని హెచ్చరిస్తారు నిపుణులు.

  • బచ్చలికూర, గోంగూర, పాలకూరలో ఆక్సలేట్‌ అనే హానికర పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. శరీరం ఐరన్‌, క్యాల్షియం శోషించుకోకుండా అడ్డుపడుతుంది. అందుకే  వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల ఇందులో దీని పాళ్లు తగ్గి హాని జరగదు.
  • వంకాయలో (vegetables) పోలనిన్‌ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. దీన్ని పచ్చిగా తిన్నా, సగం ఉడికింది తిన్నా వికారం, వాంతులు, మైకం వస్తాయి.
  • కొందరు పచ్చికోడి గుడ్లను తీసుకుంటారు. ఇందులోని బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని చేయొచ్చు. తెల్లసొన, పచ్చసొన పూర్తిగా గట్టిపడేంతవరకూ గుడ్లని ఉడికించి తినాలి. ఒకవేళ పచ్చివి వాడాల్సివస్తే శీతలీకరించిన గుడ్లను వాడటం ఉత్తమం. ఈ రోజుల్లో పాలల్లో స్వచ్ఛత తక్కువే. వీటిని పచ్చివి తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. కాచిన తర్వాతే తాగాలి. లేదంటే పాశ్చరైజ్డ్‌(శీతలీకరించిన) పాలు వాడాలి.
  • క్యాబేజ్‌, క్యాలీఫ్లవర్‌, బ్రొకలీ వంటి వాటిలో పాథోజన్స్‌ అధికంగా ఉంటాయి. వీటిని పచ్చిగా తీసుకున్నా లేదా సగం ఉడికించి తీసుకున్నా జీర్ణమవక ఇబ్బందులు తలెత్తుతాయి. పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉన్నవాళ్లు కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్