ఎండల్లో చల్ల‘టీ’ ఆరోగ్యానికి మేటి!

మార్చి మొదలయ్యిందో లేదో ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటప్పుడు చల్లచల్లగా ఏమైనా తాగితే బాగుండుననిపిస్తుంది. అది దాహాన్నే కాదు...ఆరోగ్యాన్ని పెంపొందించేదైతే మరీ మంచిది.

Published : 16 Mar 2024 01:53 IST

మార్చి మొదలయ్యిందో లేదో ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటప్పుడు చల్లచల్లగా ఏమైనా తాగితే బాగుండుననిపిస్తుంది. అది దాహాన్నే కాదు...ఆరోగ్యాన్ని పెంపొందించేదైతే మరీ మంచిది. అలాంటివే ఇవన్నీ...

ఐస్డ్‌ గ్రీన్‌ టీ... చాయ్‌ ప్రేమికులు, ఫిట్‌నెస్‌ ఔత్సాహికులకు ఈ వేసవిలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం ఐస్డ్‌ గ్రీన్‌ టీ. దీన్ని సాధారణంగా కామెల్లియా సినెన్సిస్‌ అనే మొక్క ఆకులను ఫర్మెంటేషన్‌ చేయకుండా ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెట్టి చేస్తారు. గ్రీన్‌ టీలో పాలీఫీనాల్స్‌ ఎక్కువగా ఉండి... ఒత్తిడి నుంచి బయటపడేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ ప్రక్రియ మందగించకుండా సాయపడటమే కాదు, వ్యాధినిరోధక శక్తినీ పెంచుతాయి.

ఐస్డ్‌ లెమన్‌ గ్రాస్‌ టీ: వేసవి వేడి నుంచి ఒంటిని చల్లబరిచి ఆరోగ్య ప్రయోజనాలెన్నో అందిస్తుందీ టీ. నిమ్మగడ్డిలో ఔషధగుణాలెన్నో! దీంతో చేసిన తేనీటిని రోజుకోసారైనా తాగితే చాలు... వేడి మూలంగా వచ్చే అజీర్తి సమస్యలు, తలనొప్పి వంటివన్నీ అదుపులోకి వస్తాయి. లెమన్‌గ్రాస్‌లో ఉండే సిట్రల్‌, జెరేనియం అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు... కడుపులో మంటను తగ్గిస్తాయి. గుండెపోటు వచ్చే ముప్పుని అడ్డుకుంటాయి. ఇక, దీన్నుంచి వచ్చే సువాసన మనసుని తేలిక పరుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్