ఒత్తిడి తగ్గించే వారాంతపు సెలవు!

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే... భారం తమపైనే ఎక్కువ పడుతుందంటారు మహిళలు. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే... ఒత్తిడి ఎక్కువై కుంగుబాటూ వారిని ఇబ్బంది పెట్టొచ్చు.అలా కాకూడదంటే జీవనశైలిలో ఈ మార్పులు తప్పనిసరి.

Published : 22 Jul 2021 01:28 IST

 

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే... భారం తమపైనే ఎక్కువ పడుతుందంటారు మహిళలు. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే... ఒత్తిడి ఎక్కువై కుంగుబాటూ వారిని ఇబ్బంది పెట్టొచ్చు.అలా కాకూడదంటే జీవనశైలిలో ఈ మార్పులు తప్పనిసరి.

* పంచేయండి...: మహిళలకు వంట తప్పకపోవచ్చు. కానీ మిగిలిన పనుల్ని భర్త, పిల్లలు పంచుకునేలా చూసుకోవాలి. అంటే నీళ్లు పట్టడం, బెడ్‌ సర్దడం, కూరగాయలు తరగడం, ఉతికిన దుస్తుల్ని ఆరేయడం, మడతపెట్టడం వంటివన్న మాట. ఇవి చెప్పడానికి చిన్నపనులేగా అనిపించినా... బోలెడంత సమయం పట్టేస్తుంది. వీటితో పాటు ఎవరి వస్తువులు వారు అవసరానికి సిద్ధంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. వీలైతే ఇది ముందు రోజే చేసేలా చూడండి. అప్పుడు మీకూ కాస్త కంగారు తగ్గుతుంది.

* కలిసిమెలిసి...: ఒత్తిడి ఎక్కువైతే అది ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. క్రమంగా తనని ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే భావన తోడైతే... మానసికంగానూ కుంగుబాటు పెరిగిపోతుంది. అలాకాకుండా ఆలుమగలు కలిసి మెలిసి పనులు చేసుకోవడం వల్ల చాలా విషయాలను మాట్లాడుకునే అవకాశమూ దొరుకుతుంది. అభద్రత, ఒత్తిడి దూరమవుతాయి. కుటుంబ బాధ్యతలు సంతోషంగా పంచుకోగలరు.

* విరామం కావాలి...: ఉద్యోగం చేసేవారికి వారాంతపు సెలవు ఉంటుంది. అలానే ఇటు ఇంటి బాధ్యతల్ని, అటు ఆఫీసు విధుల్ని సమర్థంగా నిర్వహించే మహిళలు ఒత్తిడి నుంచి బయటపడటానికి తమకోసం ఓ రోజుని కేటాయించు కోవాలి. ఆ సమయాన్ని తగినంత నిద్ర పోవడానికీ, చర్మం, జుట్టు, పాదాలు వంటి వాటి సంరక్షణకు కేటాయించుకోండి. నచ్చిన పాటలు వినండి. మెచ్చే సినిమా చూడండి. ఇవన్నీ మిమ్మల్ని పునరుత్తేజం పొందేలా చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్