సమయం విలువ తెలపాలి

కరోనా వల్ల పిల్లలకి పాఠశాలలు లేవు. ఆన్‌లైన్‌ క్లాస్‌లున్నా అవయ్యాక వాళ్ల వీడియో గేమ్స్‌లో వాళ్లు బిజీ. తినే టైమ్‌ మారిపోతుంది. పడుకునే సమయం దాటిపోతుంది. ఇలాగే ఉంటే రేపు బడులు తెరిచాక చాలా ఇబ్బంది పడతారు. ఆహార మార్పుల వల్లా అనారోగ్యాల బారినా పడతారు. అందుకే వాళ్లకి సమయం విలువ తెలపాల్సిన బాధ్యత అమ్మానాన్నలదే!

Published : 21 Aug 2021 02:50 IST

కరోనా వల్ల పిల్లలకి పాఠశాలలు లేవు. ఆన్‌లైన్‌ క్లాస్‌లున్నా అవయ్యాక వాళ్ల వీడియో గేమ్స్‌లో వాళ్లు బిజీ. తినే టైమ్‌ మారిపోతుంది. పడుకునే సమయం దాటిపోతుంది. ఇలాగే ఉంటే రేపు బడులు తెరిచాక చాలా ఇబ్బంది పడతారు. ఆహార మార్పుల వల్లా అనారోగ్యాల బారినా పడతారు. అందుకే వాళ్లకి సమయం విలువ తెలపాల్సిన బాధ్యత అమ్మానాన్నలదే!

బారెడు పొద్దేక్కే వరకూ పడుకోనివ్వకండి. రోజూ ఫలానా టైమ్‌కి లేవాలి. అప్పుడే ఆరోగ్యపరంగా బాగుంటారని తెలియజెప్పాలి. రెండు రోజులు మారాం చేసిన, తర్వాత నుంచి అది అలవాటుగా మారి వాళ్లే లేస్తారు.

సమయం విలువ తెలపాలిటైం టేబుల్‌ రాసివ్వండి. పొద్దున్నుంచీ రాత్రి వరకూ ఏమేం చేయాలో తెలియజేయాలి. పిల్లల రూంలోనే ఆ టైం టేబుల్‌ అంటించాలి. టైం విలువ పదే పదే చెబుతూ దాన్ని చూపిస్తుంటే తప్పకుండా మార్పు వస్తుంది.

ఏ పనినీ వాయిదా వేసే ఆలోచనే వాళ్లకి రానీయకుండా చూడాలి. ఈరోజు పనిని ఈరోజే చేయాలని వాళ్లకి పదే పదే చెబితే.. వాళ్లు అనుకున్న పనిని అనుకున్న టైంకి చేసేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో వాళ్ల లక్ష్యాలను సులువుగా చేరుకోగలుగుతారు.

రోజూ ఒకే టైంకి తినడం, ఒకే టైంకి పడుకోవడం, అలారం పెట్టి లేపడం అన్నీ సమయానుసారం జరగాలి. ఇలా చేస్తే క్రమశిక్షణ అలవడుతుంది. టైంకి వాళ్ల పనులు వాళ్లే చేసుకునేలా మారతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్