మాటలతో.. గాయపరచొద్దు!

వివాహబంధం సున్నితమైంది. సంసారమన్నాక చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయి. అంత మాత్రాన కోపం, ఆవేశం లాంటి వాటిని ఎదుటి వారిపై చూపొద్దు. కోపంలో లేదా హేళనగా మీరనే ఓ చిన్నమాట భాగస్వామి మనసును నొప్పించొచ్చు. ఇది కొనసాగితే మీ బంధం బలహీనమవ్వొచ్చు. చాలా జంటలు గొడవలు పడ్డప్పుడు ఒకరంటే మరొకరికి ఇష్టం లేదన్నట్లుగా మాట్లాడుకుంటారు. మీరూ ఆ కోవకి చెందిన వారా..

Published : 02 Sep 2021 01:04 IST

వివాహబంధం సున్నితమైంది. సంసారమన్నాక చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయి. అంత మాత్రాన కోపం, ఆవేశం లాంటి వాటిని ఎదుటి వారిపై చూపొద్దు. కోపంలో లేదా హేళనగా మీరనే ఓ చిన్నమాట భాగస్వామి మనసును నొప్పించొచ్చు. ఇది కొనసాగితే మీ బంధం బలహీనమవ్వొచ్చు.

నువ్వు నాకు నచ్చలేదు...
చాలా జంటలు గొడవలు పడ్డప్పుడు ఒకరంటే మరొకరికి ఇష్టం లేదన్నట్లుగా మాట్లాడుకుంటారు. మీరూ ఆ కోవకి చెందిన వారా.. అయితే ఇప్పటి నుంచైనా అలాంటి మాటలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ మాట భాగస్వామి మనసును గాయపరుస్తుంది. ఇదే మీ బంధాన్ని పెళుసుబారుస్తుంది.

నేను లేకపోతే నువ్వేమీ చేయలేవు...

అంటూ కొందరు ఎదుటివారిని తేలిక చేసి మాట్లాడతారు. ఇది మంచి పద్ధతి కాదు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తోడు నీడగా అడుగులు వేసినప్పుడే ఆ బంధం మరింత దృఢమవుతుంది. కాబట్టి నేను లేకపోతే నువ్వు లేవు... లాంటి భారీ డైలాగులొద్దు. ఏదైనా సందర్భంలో భాగస్వామిపై కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండటమో లేదా ఆ ప్రదేశం నుంచి కాసేపు దూరంగా వెళ్లడమో చేయాలి. లేదా ఇద్దరూ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాలి.

లోపాలు చూపొద్దు...

పెళ్లయిన కొత్తలో ఒకరికొకరు అద్భుతమైన వ్యక్తులుగా కనిపిస్తారు. కొన్నాళ్లకు ఎదుటివారి గురించి పూర్తిగా తెలుసుకుంటారు. భాగస్వామి బలాలతోపాటు బలహీనతలనూ అంగీకరించాలి. వాటి నుంచి వారు బయటపడటానికి మీ వంతు సహకారం అందించాలే తప్ప ఎత్తి చూపుతూ కించపరచొద్దు. లోపాలున్నా భాగస్వామికి  గౌరవం, మర్యాద ఇవ్వాల్సిందే.

అన్నింటికీ ఏడుపే...

‘అనే మాటలన్నీ అనేసి చివరకు ఏడుస్తావేంటి’ అంటూ చాలామంది భాగస్వామిపై నిందలేస్తారు. సంతోషాలని అందరూ అందరితో పంచుకుంటారు. అయితే బాధ, దుఃఖం లాంటి వాటిని మాత్రమే మన అనుకున్న వారి దగ్గర ప్రస్తావిస్తాం. అలా మీ పార్ట్‌నర్‌ తన బాధను చెప్పినప్పుడు గొడవ జరిగిన సందర్భంలోనో, మరో సందర్భంలోనో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ హేళన చేయ కూడదు. అది సంస్కారం కాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్