మారేందుకు అవకాశం ఇవ్వండి

చాలామంది అమ్మాయిలు పెళ్లయ్యాక తమ అభిరుచుల్నీ, అలవాట్లనీ, ఆసక్తులనూ పక్కనపెట్టేస్తుంటారు. కాలక్రమంలో తామేదో కోల్పోయామన్న బాధలో మునిగిపోతారు. ఆలుమగలు ఒకరినొకరు అర్థంచేసుకోగలిగితే ఈ పరిస్థితి రాదంటున్నారు మానసిక నిపుణులు.

Published : 11 Oct 2021 01:44 IST

చాలామంది అమ్మాయిలు పెళ్లయ్యాక తమ అభిరుచుల్నీ, అలవాట్లనీ, ఆసక్తులనూ పక్కనపెట్టేస్తుంటారు. కాలక్రమంలో తామేదో కోల్పోయామన్న బాధలో మునిగిపోతారు. ఆలుమగలు ఒకరినొకరు అర్థంచేసుకోగలిగితే ఈ పరిస్థితి రాదంటున్నారు మానసిక నిపుణులు.

పంచుకుంటేనే ప్రేమ...
ఎంతసేపూ నేనూ, నా అని ఆలోచించడం సరికాదు. భాగస్వామి అభిరుచులు, ఆలోచనలను పంచుకోగలిగితే మీ అనుబంధం సంతోషంగా సాగిపోతుంది. అప్పుడే మీ  మధ్య ప్రేమ పెరుగుతుంది.

బాధపెట్టకండి...
చదువు, ఉద్యోగం, ఆలోచనా విధానం, పనితీరు...ఇలా ఒక్కో విషయంలో ఒకరుపైన, మరొకరు కింద ఉండి ఉండొచ్చు. అంతమాత్రాన ఎత్తిచూపడం, తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. వైవాహిక బంధంలో ఉన్న మీ ఇద్దరూ ఒక్కటే  ప్రోత్సహిస్తే మీ భాగస్వామి మీకు తగ్గట్లు మార్పులు చేసుకోగలరు. కొత్త విషయాలెన్నో నేర్చుకోగలరు. 

మనసు విప్పి చెప్పండి...
ఎదుటివారు మన మనసులో ఉన్నది తెలుసుకుని...సంతోష పెట్టాలనుకోవడం పొరబాటు. మీరే మీ ఆలోచనల్ని, ఆసక్తులను చెప్పండి. అవతలివారికి అవి ఇష్టం లేకపోతే...మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయో నెమ్మదిగా చెప్పి ఒప్పించుకోండి. అప్పుడు అర్థం చేసుకోగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్