గొడవలు రాకుండా గోడ కట్టేయండి
close
Updated : 03/11/2021 06:01 IST

గొడవలు రాకుండా గోడ కట్టేయండి!

ప్రేమించి పెళ్లి చేసుకున్న నిత్య, నిఖిల్‌ల వైవాహిక జీవితంలో నాలుగు నెలలు గడిచాయో లేదో గొడవలు మొదలయ్యాయి. బాధ్యత లేదని ఒకరు, ప్రేమ కనిపించడం లేదని ఇంకొకరు ఒకరిని మరొకరు ఎత్తి చూపుకొంటున్నారు. కారణాలు చిన్నవే అయినా...కలతలు మాత్రం విడాకుల వరకూ వచ్చేస్తాయి. మరేం చేయాలి?

అతడు పదే పదే టీలు తాగడం తనకు నచ్చలేదంటుంది ఆమె. తరచూ దుస్తులు కొని డబ్బులు వృథా చేస్తుంది కాబట్టి తను నాకు వద్దంటాడు అతను. లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ...ఒకరినొకరు ఎత్తి చూపుకొంటూ ప్రతి చిన్న విషయాన్నీ సమస్యగా మార్చేసుకుంటారు కొందరు. నిజానికి ఇవేవీ సర్దుబాటు కాని సమస్యలేం కాదు. కానీ ఆ దిశగా ప్రయత్నించరు. ఒకరిపై మరొకరు చిర్రుబుర్రులాడే బదులు...చెప్పే విషయాన్నే కాస్త సరదాగా అనండి. అవతలి వారు స్వీకరించే పద్ధతిలోనూ మార్పు వస్తుంది.

* నేనెందుకు అడగాలి? నా తప్పు లేనే లేదు...నేను మాట్లాడను...అంటూ బోలెడు మాటల్ని ఒకరిపై మరొకరు బాణాల్లా విసిరేసుకుంటూ ఉంటారు. దీనికి అహమే కారణం. ఒక్క అడుగు తగ్గి చూడండి. ముందు మీరే మాట్లాడితే...వాళ్లూ మీ మీద ప్రేమ ఒలకబోస్తారేమో! కోపంలో ఉన్నప్పుడు మాటలు పొదుపుగా వాడితే అపార్థాలు ఎదురుకావు.

* కాపురం అన్నాక చిన్నపాటి కలతలు సహజం. పెళ్లయిన తరువాత ఇద్దరి మనసులు కలిసేందుకు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఒకరికొకరు అర్థం అయ్యేలోపే నీకూ నాకూ పొసగదు అనే తీవ్ర నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కాస్త వేచి చూడండి. మీ వంతుగా మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నించండి.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని