Updated : 07/11/2021 04:57 IST

చిన్నారులకూ ఒత్తిడి

తోబుట్టువులతోనూ కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే పిల్లలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించాలంటున్నారు మానసిక నిపుణులు. చిన్నపిల్లలకు  ఏం ఒత్తిళ్లుంటాయి అనుకోకుండా ఆ ఆలోచనల నుంచి వాళ్లను బయటకు తీసుకురాకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

గుర్తించి... చిన్నారుల ప్రవర్తనలో మార్పును తల్లిదండ్రులు గుర్తించ గలగాలి. కారణాల్నీ కనిపెట్టాలి. ఇంటివాతావరణం, చదువులు, స్నేహితుల ప్రభావం వంటి పలు అంశాలు పిల్లల్లో ఒత్తిడికి దారితీస్తాయి. వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగితే వారి మనసును అర్థం చేసుకోవచ్చు. ఏ విషయం ఆ చిన్ని మనసును బాధిస్తోందో గుర్తించగలిగితే తేలికగా పరిష్కరించొచ్చు. వారి మనసులోని ఒత్తిడిని బయటపెట్టడానికి తగిన వాతావరణాన్ని కల్పించాలి. కోపాన్ని ప్రదర్శించకుండా చిన్నారులతో మృదువుగా మాట్లాడాలి. అప్పుడే పిల్లలు వారి మనసులోని మాటను ధైర్యంగా చెప్పగలుగుతారు. ఒత్తిడికి కారణాన్ని త్వరగా గుర్తించి దూరం చేయడానికి ప్రయత్నిస్తే చాలు.

ఉత్సాహాన్ని నింపి.. చదువు విషయంలో ఒత్తిడికి గురి అవుతుంటే వారికి ధైర్యం చెప్పాలి. తెలియని పాఠాలను విడమర్చి చెప్పడం, చిన్నచిన్న టాస్క్‌ల రూపంలో పాఠ్యాంశాలను తేలికగా అర్థమయ్యేలా చెప్పడం, వారిలో ఉత్సాహం నింపడం ద్వారా భయాన్ని మటుమాయం చేయొచ్చు. అప్పుడు వాళ్లే రాణిస్తారు. మార్కులను కొలమానంగా చూడొద్దు. ఇతర పిల్లలతో పోల్చొద్దు. అమ్మానాన్నలు ఇచ్చే చిన్నచిన్న ప్రశంసలే చిన్నారులను మరో అడుగు ముందుకు వేసేలా ప్రోత్సహిస్తాయి.

సమయాన్ని కేటాయిస్తూ.. ఫోన్‌, టీవీకి అతుక్కుపోకుండా ఉండాలంటే... చదువుతోపాటు ఆటలకూ కొంత సమయాన్ని కేటాయించాలి. ఇలా దేనికి దానికి సమయాన్ని విభజించుకోవడం, దాన్ని అమలు చేయడం నేర్పించాలి. ఇందులో ఆసక్తి చూపించకపోయినా, వారి కోసం పెద్ద వాళ్లు అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఆడటానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రులు ఉత్సాహంగా మైదానంలో ఆడుతుంటే క్రమేపీ చిన్నారుల్లోనూ మార్పు కనిపిస్తుంది. అంతేకాదు, తోటి పిల్లలతో కలిసి ఆడుకునే వాతావరణాన్ని కల్పిస్తే చాలు. పిల్లల్లో శారీరక, మానసికారోగ్యం పెంపొందుతుంది. ఇది వారిని ఒత్తిడి నుంచి దూరం చేసి, నిత్యం ఉత్సాహవంతులుగా ఉండేలా చేస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని