కాకనూనెతో ముప్పు
close
Updated : 14/11/2021 05:08 IST

కాకనూనెతో ముప్పు

ఘుమఘుమలాడే మిర్చి బజ్జీలంటే ఇష్టం లేని దెవరికి. వాటిని వేయించిన నూనెతోనే మర్నాడు చేస్తారు. ఇళ్లల్లోనూ గారెలు, బూరెలు, పూరీలు, పునుగులకు మూకుడు నిండా నూనె పోస్తాం. అవయ్యాక మిగిలిన నూనెను మళ్లీ రోజువారీ వంటకు వాడేస్తాం. కానీ ఈ కాకనూనె ఎంత హానికరమో తెలుసా?

ఈ నూనెతో చేసే వంటల వల్ల చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి పెరుగుతుంది. ఎసిడిటీ, అల్సర్లు, గొంతు నొప్పి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉత్సన్నమవుతాయి. రక్తపోటు, మధుమేహం, హృద్రోగాలు వస్తాయి. క్యాన్సర్‌ ప్రేరకంగానూ మారుతుంది.

కాబట్టి.. బయట తిండి జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ప్రయాణ సమయంలోనూ ఇంటి నుంచి వంటకాలు తీసికెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లోనూ నూనె పదార్థాలని తగ్గిస్తే మంచిది. చేసినప్పుడే చిన్న మూకుట్లో కొద్దిపాటి నూనెతో చేసి మిగిలిన నూనెను పారబోయడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అప్పడాలు, వడియాల్లాంటివి మైక్రోవేవ్‌లో నూనె లేకుండానే వేయిస్తే సరి. కాకనూనె విషతుల్యం కాకుండా ఉండాలంటే కూరగాయలు లేదా పప్పులు ముందు ఉడికించి తాలింపు చివర్లో వేయాలి. అప్పుడు ఆ నూనె మరగదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని