Published : 20/11/2021 00:30 IST

చిన్నారులేం చూస్తున్నారు...

ఇంట్లో పిల్లలు గంటలతరబడి ఫోన్‌లో ఏం చూస్తున్నారనే ఆరా తల్లిదండ్రులకు ఉండాలి. ఎటువంటివి చూడాలి, ఏవి చూడకూడదనే విషయంపై పిల్లలకు అవగాహన కలిగించే బాధ్యత పెద్దవాళ్లదే అంటున్నారు నిపుణులు...

మొదట్లోనే... ప్రస్తుత కాలంలో సోషల్‌నెట్‌ వర్కింగ్‌ వేదికలు, మెసేజింగ్‌ రూంలు, వర్చువల్‌ వరల్డ్స్‌, బ్లాక్స్‌వంటివి పెరిగాయి. స్నేహాల నుంచి క్రీడల వరకు మొత్తమంతా ఆన్‌లైన్‌ వేదికగా మారింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నవారు కూడా సోషల్‌మీడియాలో సభ్యులైపోతున్నారు. పిల్లలు మొదటిసారిగా ఆన్‌లైన్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నప్పుడే వారికి మంచి,చెడుపై అవగాహన కలిగించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి. మొదట్లో వారితో కలిసి ఉంటూ గమనించడం మంచిది. ఇంటి సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయుల ఫొటోలను వారి అనుమతి లేకుండా పోస్ట్‌ చేయకూడదని ముందుగానే చెప్పాలి.

ఇలా చేస్తే.. పిల్లలకు అవసరంలేనివి, వారిని ప్రమాదంలోకి నెట్టేలా ఉండే సాఫ్ట్‌వేర్స్‌ను కంప్యూటర్‌ నుంచి తొలగించడం మంచిది. ఫిల్టరింగ్‌ సాఫ్ట్‌వేర్‌ విధానాన్ని పాటించాలి. అలాగే వ్యక్తిగత సమాచారం, ఫొటోలను సోషల్‌మీడియాలో పొందుపరచకూడదని, వాటివల్ల కలిగే పరిణామాలపై అవగాహన కలిగిస్తే మంచిది. వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటుగానే ఉంచడం నేర్పాలి. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ గురించి క్షుణ్ణంగా పెద్దవాళ్లు ఎప్పటికప్పుడు ముందుగానే తెలుసుకుంటూ వాటిపై పూర్తి అవగాహన పొందాలి. 13 ఏళ్ల పిల్లలకు చాలా సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌, వెబ్‌సైట్స్‌ అనుమతినిస్తున్నాయి. అలా టీనేజ్‌ పిల్లలు నెట్‌ను వినియోగిస్తే, ఆన్‌లైన్‌లో ఇమేజెస్‌, వారు చేసిన వర్క్‌  అంతా కాపీరైట్‌ ప్రొటెక్టెడ్‌గా ఉండేలా చేయాలి. అలాగే ఆన్‌లైన్‌ స్నేహితులను కలుపుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని చెప్పాలి.

అవగాహన... సైబర్‌ బెదిరింపుల గురించి పిల్లలకు అవగాహన కలిగించాలి. ఈమెయిల్‌ ఐడీ, యూజర్‌నేమ్స్‌, పాస్‌వర్డ్స్‌ వంటి సమాచారాన్ని ఎవరికీ షేర్‌ చేయకూడదని చెప్పాలి. వీటిని ఎదుటివారు ఎలా దుర్వినియోగం చేస్తారో వివరించాలి. సామాజికపరంగా చోటుచేసుకునే ఎటువంటి సున్నిత అంశంపైనా మనసుకు నచ్చినట్లు స్పందించడం ప్రమాదకరమని తెలియజేయాలి. ప్రతి విషయంపై మర్యాద పాటించాలని, అలాగే వీలైనంత ఆన్‌లైన్‌ సమయాన్ని తగ్గించుకునేలా ప్రయత్నించమని చెప్పాలి. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ వంటి క్రీడలకు పిల్లలను ప్రోత్సహిస్తూ, వారిని వీలైనంత ఆఫ్‌స్క్రీన్‌కు అలవరిస్తే చాలు. కుటుంబమంతా కలిసి ఆడటం, జిమ్‌కు వెళ్లడం వంటివన్నీ వారిని సోషల్‌మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించేలా చేస్తాయి.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని