జంటగా.. ఆర్థిక ప్రణాళిక
close
Published : 22/11/2021 00:28 IST

జంటగా.. ఆర్థిక ప్రణాళిక

వివాహం తర్వాత సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే భార్యాభర్తల మధ్య సమన్వయం లోపిస్తుంది. 21 శాతం వైవాహిక బంధాలు విడిపోయే స్థాయికి చేరుకోవడానికి ఇదే కారణమని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. ఇలా కాకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

దంపతులిద్దరూ ఉద్యోగులైతేే విడివిడి బ్యాంకు ఖాతాలుంటాయి. మరో ఖాతాను తెరిచి ప్రతినెలా ఇంటికి కావాల్సిన ఖర్చులకు ఇద్దరూ కొంత నగదును దానిలో జమచేయాలి. లేదా ఒకరు నెలవారీ ఖర్చులను చూసుకుంటే, మరొకరు భవిష్యత్‌ అవసరాలకు పొదుపు చేయాలి. బడ్జెట్‌ దాటకుండా పొదుపుగా సంసారాన్ని గడపడంలో ఇరువురూ ఆలోచనలను పంచుకోవాలి. ఒకరికి ఎక్కువగా ఖర్చు పెట్టే తత్వం ఉంటే ఇంకొకరు దాన్ని క్రమేపీ మార్చాలి. ఏది చేసినా తమ కుటుంబం కోసమే అనే ఆలోచన ఇద్దరిలోనూ ఉండాలి. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కొంత పొదుపుచేస్తే అత్యవసరంలో సాయపడుతుంది.

బాధ్యతలు

వ్యక్తిగతంగా ఎవరికివారు కొంత నగదును సొంతంగా తమ తమ బ్యాంకుఖాతాల్లో ఉండేలా చూసుకోవాలి. దీన్ని అభిరుచులు, ఆసక్తి లేదా సొంతంగా వినియోగాలకి విభజించాలి. వ్యక్తిగత ఆర్థికస్వేచ్ఛగా దీన్ని పరిగణించుకోవాలి. అలాగే పుట్టిన రోజులు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల కోసమూ కొంత నగదును పొదుపు చేయడం మంచిది. అయితే వీటి విషయంలో ఇద్దరికీ ఒకరిపై మరొకరికి అవగాహన ఉండాలి. రోజులో ఒకసారైనా దంపతుల మధ్య ఆర్థికప్రణాళికపై చర్చ జరగాలి. ఆ సమయంలో సానుకూలంగా మాట్లాడుకోవాలి. ఆ నెల ఏర్పడిన అదనపు భారాన్ని సమన్వయం చేసుకోవడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయి. అలాగే సంస్థలకే కాదు, ఇంటికీ బ్యాలెన్స్‌షీట్‌ ఉండాల్సిందే. ప్రతినెల ఆదాయ, వ్యయ వివరాలను ఓ పుస్తకంలో పొందుపరచాలి. ఖర్చులు.. ఆదాయాన్ని దాటుతున్నాయంటే ప్రమాదకరమైన పరిస్థితిగా అంచనా వేయాలి. అనవసర ఖర్చులను గుర్తించి తగ్గించుకోవాలి. ఏయే అవసరాలు అదనపు భారంగా మారుతున్నాయో గుర్తిస్తే సరిపోతుంది. తగ్గించుకోవడం సులువే!


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని