Updated : 04/12/2021 00:42 IST

ముచ్చటైన బుజ్జాయిల గదులు!

పిల్లలు చదువుకునే గది వారి మానసిక ఒత్తిడిని సమన్వయం చేస్తూ.. అవసరాలను తీర్చేలా ఉండాలంటున్నారు మానసిక నిపుణులు. వారిపై మంచి ప్రభావం పడేలా ఆ గదిని సర్దాలని సూచిస్తున్నారు.

గది గోడలకు పోల్కాడాట్స్‌ డిజైన్‌ వాల్‌పేపరు ఉంటే మంచిది. సప్త వర్ణాలుండేలా డిజైన్‌ను ఎంపిక చేయాలి. ఫంకీ లేదా వింటేజ్‌ ల్యాంప్స్‌ను ఏర్పాటు చేస్తే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కార్పెట్‌ నలుపు, తెలుపు కాంబినేషన్‌లోనే ఎంపిక చేయాలి.
టేబుల్‌, షెల్ఫ్‌లో అలంకరణకు ఉంచే బొమ్మలు పిల్లల్లో స్ఫూర్తిని నింపేలా ఉండాలి. శాస్త్రవేత్తలు, బుద్ధుడి విగ్రహం, అంతరిక్షం, అటవీ ప్రాంతం వంటివి ప్రస్ఫుటంగా తెలిసే పోస్టర్లున్నా చాలు. ఇవి చిన్నారులను ఆలోచించేలా చేస్తాయి. వారిలో కొత్త లక్ష్యాలను ఏర్పరచుకునేలా ప్రోత్సహిస్తాయి. ఆట బొమ్మల కోసం ప్రత్యేక అలమర ఏర్పాటు చేయాలి. ఆడుకున్నాక తిరిగి వారే సర్దుకునేలా అలవాటు చేస్తే చాలు. అలాగే గది కర్టెన్లు, మంచంపై దుప్పట్లు జంతువుల బొమ్మలతో పిల్లల కోసం ప్రత్యేకంగా లభిస్తున్నాయి. లేత వర్ణాలవి ఎంచుకోండి.  

*పర్యావరణ హితంగా.. గదికి కనీసం మూడు మూలల్లో చిన్న బల్లలుంచి వాటిపై ఒక్కో రకం ఇండోర్‌ ప్లాంట్‌ను అమర్చాలి. వాటి పరిరక్షణ పిల్లలకే అప్పజెప్పాలి. వాతావరణ కాలుష్యాన్ని నివారించే మొక్కలపై అవగాహన కలిగిస్తే పర్యావరణ పరిరక్షణ దిశగానూ ఆలోచిస్తారు. ఇదో అభిరుచిగానూ మారుతుంది. గదంతా సానుకూలత నిండితేనే పిల్లల్లో మానసిక ఒత్తిడి దూరమవుతుంది.

* బుక్‌ షెల్ఫ్‌.. చదువుతోపాటు పుస్తకపఠనంపై ఆసక్తిని పెంచేలా ఈ షెల్ఫ్‌ను సర్దాలి. స్ఫూర్తిని కలిగించేవారి జీవితచరిత్రలు, ప్రపంచవింతలు, విశేషాలు, కథలు, రకరకాల జంతువుల వివరాలుండే పుస్తకాలను ఉంచాలి. చిన్నచిన్న బ్లాక్‌లుగా విడదీసి మరీ వాటిని సర్దాలి. మొదట కొంత ప్రోత్సహిస్తే చాలు. క్రమేపీ వారికి కావాల్సిన వాటిని వారే ఎంచుకునే స్థాయికి ఎదుగుతారు. ఈ తీరు ప్రపంచజ్ఞానాన్నీ పెంపొందిస్తుంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని