పాఠశాలకు వెళ్లనంటున్నారంటే..

కొవిడ్‌ తర్వాత బడులు తెరుస్తున్నారనగానే విద్యకి ఊరటగా అనిపించింది. పిల్లలిద్దరూ ఉత్సాహంగా చదువులో లీనమవుతారనుకుంది. వారం రోజులు వెళ్లారో లేదో.. ఎగ్గొట్టేందుకు వంకలు వెదుకుతున్నారు. కోప్పడితే ఏడుస్తున్నారు. ఈ పరిస్థితి సాధారణమే అంటున్నారు మానసిక నిపుణులు. ఇదీ ఒకరకమైన ఒత్తిడే అంటున్నారు.

Updated : 10 Dec 2021 01:51 IST

కొవిడ్‌ తర్వాత బడులు తెరుస్తున్నారనగానే విద్యకి ఊరటగా అనిపించింది. పిల్లలిద్దరూ ఉత్సాహంగా చదువులో లీనమవుతారనుకుంది. వారం రోజులు వెళ్లారో లేదో.. ఎగ్గొట్టేందుకు వంకలు వెదుకుతున్నారు. కోప్పడితే ఏడుస్తున్నారు. ఈ పరిస్థితి సాధారణమే అంటున్నారు మానసిక నిపుణులు. ఇదీ ఒకరకమైన ఒత్తిడే అంటున్నారు.

స్కూల్‌ పేరు చెబితేనే తలనొప్పి, కడుపునొప్పి అంటున్నారంటే అది వారిలోని ఒత్తిడిగా గుర్తించాలి. ప్రశాంతంగా మాట్లాడి కారణాన్ని కనుక్కోవాలి. పాఠశాలకెళితే కలిగే ఉపయోగాలను నెమ్మదిగా, మృదువుగా తెలియజెప్పాలి. మనం తెలియకుండానే టీచర్ల పేరిట పెట్టే భయం కూడా ఒక్కోసారి ఇందుకు కారణమవొచ్చు. కాబట్టి, దాన్ని మానేయండి. వారి గురించి సానుకూలంగా చెప్పే ప్రయత్నం చేయండి.

* ఆడుకోనివ్వండి.. ఇంట్లో గంటో, రెండు గంటలో తరగతులు. నచ్చిన బ్రేక్‌లు, క్లాసులో తిన్నా, ఆడినా గమనించే అవకాశాలు తక్కువ. ఒక్కసారిగా గంటల తరబడి కూర్చోవడం కష్టంగా అనిపించొచ్చు. ఇంటికొచ్చాకా తిరిగి హోంవర్క్‌లు.. అయిష్టం మామూలే. కాబట్టి, ఇంటికి దగ్గర్లోని పార్కు, మైదానాలకి తీసుకెళ్లండి. రోజూ కాసేపు ఆడుకోవడానికి సమయమివ్వండి. ఇది వారి ఒత్తిడిని దూరం చేస్తుంది. కొత్త స్నేహాలూ దొరికి ఉత్సాహంగా ఉంటారు. దీంతోపాటు  కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడం, ఇండోర్‌ గేమ్స్‌ ఆడటం వంటివీ పిల్లల మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడం, స్ఫూర్తినిచ్చే వారి కథలను చెప్పడం, వాటితోపాటు చదువు విలువను వివరించడం వంటివీ సాయపడతాయి.

* అవకాశం.. ఏదైనా చెప్పాలనుకుంటే ఓపిగ్గా వినండి. నువ్వేం మాట్లాడతావు, నీకేం తెలీదు అనే పెద్దవాళ్ల మాటలు వారిలో ధైర్యాన్ని పోగొడతాయి. వారి మానసికబలాన్ని పెంచేలా మాట్లాడనివ్వాలి. అది వారిలో ప్రతి అంశంపై కూలంకషంగా ఆలోచించేలా చేస్తాయి. ఏదైనా తప్పుగా చెబితే సరిచేయడానికి ఎలాగూ మీరున్నారుగా! కామ్‌గా ఉండే పిల్లల్నీ మాట్లాడేలా ప్రోత్సహించండి. గతంలో వారు తెచ్చుకున్న మార్కులు, ఉపాధ్యాయుల ప్రశంసలు వంటివి గుర్తు చేయండి. వాళ్ల బాధేదైనా మీతో పంచుకునేలా చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్