Updated : 14/12/2021 05:47 IST

చిన్నవాళ్లని వెనకేసుకురావద్దు

నీతూకి ఇద్దరమ్మాయిలు. హోంవర్కు, ఆట... సందర్భమేదైనా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉంటారు. ఇది ఇలాగే కొనసాగితే.. పెద్దయ్యాక వారికి సఖ్యతే ఉండదేమో అని ఆమె భయం. అలా కాకూడదంటే..

పిల్లలు ఎవరికి వారే ప్రత్యేకం. ఒకరితో మరొకరిని పోల్చొద్దు. అలా చేస్తే తోటివారిపై ద్వేషం, అసూయ కలగడంతోపాటు వాళ్లలో ఆత్మ న్యూనత ఏర్పడుతుంది. చదువులోనూ వెనకబడతారు. కొందరు చిన్నారులు ఆహారం తీసుకోవడంలో అయిష్టత, ఆడుకోవడంలో అనాసక్తి వంటివీ చూపిస్తారు. ‘అన్నయ్య నీలా ఎదురు మాట్లాడడు’, ‘అక్కలా నువ్వెందుకు బాగా చదవవు’.. లాంటి పోలికలు వారిని కించపరిచినట్లుగా భావించే ప్రమాదముంది. తమపై తల్లిదండ్రులకు ప్రేమ లేదేమో అనే సందేహాన్నీ కలిగించొచ్చు. కాబట్టి,  పోలిక లేకుండా చెప్పే ప్రయత్నం చేయండి.

* కలిసి చేసేలా... తోబుట్టువులిద్దరికీ కలిపి పనులు అప్పజెప్పండి. ఇద్దరికీ కలిపి బొమ్మలు కొనివ్వడం, ఇంటి, తోట పనుల్ని ఇద్దరికీ పురమాయించడం వంటివి చేయాలి. ఈ చర్యల ద్వారా పంచుకోవడం, కలిసి పని చేయడం అలవాటవుతాయి. తప్పు ఎవరు చేసినా మందలించాలి. చిన్నోడని వెనకేసుకు రావొద్దు, పెద్దోడని గౌరవం ఆపాదించొద్దు. ఒకరినొకరు క్షమించుకునేలా ప్రోత్సహించండి. మీ లక్ష్యం ఇద్దరినీ కలపడమే అవ్వాలి. ఇది వారి మధ్య ప్రేమ పెరిగేలా చేస్తుంది. పెద్దవాళ్లని నేతృత్వం వహించమనండి. బాధ్యత తెలుస్తుంది.

* వాళ్లకే వదిలేస్తే.. తోబుట్టువుల మధ్య ఏదైనా సమస్య వస్తే వాళ్లనే పరిష్కరించుకోమనాలి. పోట్లాటకు వెళ్లకుండా ఓ కంట కనిపెడుతూనే ఇద్దరినీ ఒంటరిగా వదిలేయాలి. తద్వారా సమస్యపై చర్చించుకోవడం, ఒకరితో మరొకరు మాట్లాడుకుని పరిష్కరించుకోవడం నేర్చుకుంటారు. ఒకరి కోణం మరొకరికీ అర్థమై ఇద్దరి అనుబంధమూ పెరుగుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని