మౌనం... మంచిదే

‘రమణ, సౌమ్య దాంపత్యంలో గొడవలకు తావుండదు. ఇరువురూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు’. బంధువులనే ఈ మాటలను వింటుంటే సౌమ్యకు కొంత సంతోషంగా ఉన్నా... కాస్తంత వేదనగానూ అనిపిస్తుంటుంది. ఎందుకంటే రమణ కోపం ముందు తానెప్పుడూ మౌనంగా ఓడిపోవడం మరెవరికీ తెలీదు. అయితే కొన్ని సందర్భాల్లో మౌనమే మంచిదంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే..

Updated : 16 Dec 2021 05:27 IST

‘రమణ, సౌమ్య దాంపత్యంలో గొడవలకు తావుండదు. ఇరువురూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు’. బంధువులనే ఈ మాటలను వింటుంటే సౌమ్యకు కొంత సంతోషంగా ఉన్నా... కాస్తంత వేదనగానూ అనిపిస్తుంటుంది. ఎందుకంటే రమణ కోపం ముందు తానెప్పుడూ మౌనంగా ఓడిపోవడం మరెవరికీ తెలీదు. అయితే కొన్ని సందర్భాల్లో మౌనమే మంచిదంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే..

గౌరవం.. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ మనస్పర్థలు, గొడవలు రావడం సహజమే. వీటిని వారిద్దరూ ఎలా సమన్వయం చేస్తారనేది ఆ దాంపత్యం చెబుతుంది. దంపతులిద్దరికీ ఒకరిపై మరొకరికి ప్రేమాభిమానాలతోపాటు గౌరవం ఉంటే అసలు మనస్పర్థలకు తావుండదు. అలాగే గొడవలొచ్చినప్పుడు ఇద్దరిలో ఒకరికైనా అవతలివారిపై గౌరవం ఉన్నా కూడా.. ఆ సమస్య ఎంతోదూరం వెళ్లదు. అలాకాకుండా ఆలుమగల మధ్య మర్యాదకే స్థానం లేకపోతే నిత్యం వారి సంసారం సమస్యలమయంగానే మారుతుంది. భాగస్వామి పట్ల చులకనభావం ఉండకూడదు. కించపరిచినట్లుగా చూడటం ఎదుటివారిని మరింత వేదనకు గురిచేస్తుంది.  

సహనం.. దంపతుల్లో ఒకరికైనా సహనం ఉండాలి. అది ఎలాంటి సమస్యనైనా వెనుదిరిగేలా చేయగలదు. సంయమనం పాటించడం, మౌనంగా ఉండటం భార్యాభర్తల్లో ఒకరికి తెలిసినా, ఆ బంధం నిలుస్తుంది. అభిప్రాయభేదాలు, పిల్లల పెంపకం లేదా బంధువుల గురించి తగవు వచ్చినప్పుడు దంపతుల్లో ఒకరు హెచ్చుస్థాయిలో మాట్లాడితే మరొకరు మౌనంగా ఉండటం మేలంటున్నారు నిపుణులు. లేదంటే గొడవ తారస్థాయికి చేరుకొని, అది భేదాభిప్రాయాలను పెంచే ప్రమాదం ఉంది. కాసేపు మౌనంగా ఉండటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మౌనం.. మంచిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్