అబ్బాయికీ పనులు నేర్పాలి...

లావణ్య తన కొడుకుకి చిన్న పని చెప్పినా  అత్తగారు కోప్పడతారు. మగపిల్లాడికి పని చెబుతావేంటి అంటూ విరుచుకుపడతారు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఈ పని చేయాలి, అబ్బాయిల ఆ పని మాత్రమే చేయాలి అంటే కుదరదు అంటున్నారు మానసిక నిపుణులు. చిన్నప్పటి నుంచి వివక్ష

Updated : 17 Dec 2021 05:18 IST

లావణ్య తన కొడుకుకి చిన్న పని చెప్పినా  అత్తగారు కోప్పడతారు. మగపిల్లాడికి పని చెబుతావేంటి అంటూ విరుచుకుపడతారు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఈ పని చేయాలి, అబ్బాయిల ఆ పని మాత్రమే చేయాలి అంటే కుదరదు అంటున్నారు మానసిక నిపుణులు. చిన్నప్పటి నుంచి వివక్ష లేకుండా పిల్లల్ని పెంచాలని సూచిస్తున్నారు. అబ్బాయిలకీ ఇంటి పనులు నేర్పాల్సిన అవసరం ఉందంటున్నారు.

* జీవితంలో భాగం... ఇంటి పని జీవితంలో ఓ భాగం. చదువుకున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదా వివాహమైన తర్వాతా ప్రతి పనీ తెలిసి ఉంటేనే సునాయాసంగా జీవితంలో ముందుకు వెళ్లగలుగుతారు. ఉద్యోగం ఎంత ముఖ్యమో... ఆహారం కూడా అంతే ముఖ్యం. అటువంటప్పుడు వంట నేర్చుకోవడంలో తప్పు లేదు. ప్రతి పనినీ తెలుసుకుని ఉంటే ఎవరిపైనా ఆధారపడాల్సిన పనిలేదు. అలా జరగాలంటే చిన్నప్పటి నుంచి మగపిల్లలకూ ఇంటి పని నేర్పితేనే భవిష్యత్తులో రాణిస్తారు.

* అమ్మను చూసి.. ఇంట్లో అమ్మ మాత్రమే పని చేస్తూ, నాన్న ఖాళీగా కూర్చుంటే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. అందుకే తల్లిదండ్రులు పనిని పంచుకుంటూ, పిల్లలకూ చిన్నచిన్న పనులు నేర్పాలి. పాత్రలు కడగడం, కూరగాయలు కోయడం, ఇంటిని శుభ్రం చేయడం వంటి పనులన్నీ బాల్యం నుంచే నేర్పించాలి. అలసటగా అనిపించకుండా ఆడుతూ పాడుతూ చేయగలిగే చిన్నచిన్న పనులు అప్పగిస్తే చాలు. పిల్లలు బాధ్యత తెలుసుకుంటారు. పని అంతా ఒక్కరే కాకుండా ఎదుటి వారు కూడా పంచుకోవాలనే ఆలోచన వారిలో బాల్యం నుంచే మొదలవుతుంది.

* శుభ్రత... బాల్యం నుంచి ఎవరి గదిని వారే శుభ్రం చేసుకోవడం పిల్లలకు అలవాటు చేస్తే చాలు. పరిశుభ్రతపై అవగాహనే కాకుండా, ఎవరి పని వారు చేసుకోవడంలో ఎంత సంతోషం దాగి ఉందో తెలుసు కుంటారు. అమ్మకు సాయం చేయడం శిక్షణగా మారుతుంది. ఇతరులకు చేయూతనందించడం, తోబుట్టువు లేదా భార్య కష్టపడుతుంటే సాయం చేయడం వంటివన్నీ చిన్నప్పుడు అమ్మ నుంచి నేర్చుకుంటేనే వీలవుతాయి. ఇదొక క్రమశిక్షణగా కాకుండా రోజూవారీ పనుల్లాగే నేర్పితేనే పిల్లలకూ కష్టమనిపించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్