అసూయాపరుడితో జాగ్రత్త

భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలంటే అది ఇద్దరి వల్లే సాధ్యమవుతుంది. అంతేకానీ నేనే గొప్ప, ఎదుటి వారు తన మాటే వినాలి... మిగతా ప్రపంచంతో పనిలేదు అంటూ స్వార్థంగా ఆలోచించే

Published : 20 Dec 2021 01:20 IST

భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలంటే అది ఇద్దరి వల్లే సాధ్యమవుతుంది. అంతేకానీ నేనే గొప్ప, ఎదుటి వారు తన మాటే వినాలి... మిగతా ప్రపంచంతో పనిలేదు అంటూ స్వార్థంగా ఆలోచించే భాగస్వామి దొరికితే మాత్రం కష్టమే. మీ భాగస్వామిలోనూ ఈ లక్షణాలున్నాయా... జాగ్రత్త సుమా..

కేవలం నువ్వు, నేను... భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని కోరుకోవడం సహజం. అయితే మొత్తంగా వారితోనే ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఎంత భార్యాభర్తలైనా ఎవరికి వారు తమకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోవాలి. ‘ఎప్పుడూ నా వెంటే ఉండాలి. ఎవరితోనూ ఉండొద్దు’ అని మీ భాగస్వామి అంటున్నారంటే అవతలి వ్యక్తికి కాస్త అసూయ ఉన్నట్లుగా గుర్తించాలి.

మానసికంగా... వారు మానసికంగా మీపై ఎక్కువగా ఆధారపడతారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేరు. ప్రతి క్షణం వారినే అంటి పెట్టుకోవాలనుకుంటారు. మీకంటూ కొంత సమయం కావాలని అనుకోరు.

మాటే శాసనంగా... అసూయను వైఫైలా కలిగి ఉండే వారిలో ఎదుటివారు తమ మాటే వినాలని, తాము చెప్పిందే చేయాలని అనుకుంటారు. మీ భాగస్వామి అలాంటి వారేమో ఓసారి పరిశీలించి చూసుకోండి.

అనుమానంగా.. మీకు తెలియకుండా మీ ఫోన్‌లో మెసేజ్‌లు, వాట్సాప్‌ మెసేజ్‌లు చూడటం లాంటివి చేస్తుంటే ఎదుటి వారి అసూయ కాస్తా అనుమానంగా పెరిగిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేయాలి.

భరించొద్దు... భాగస్వామికి కోపం వస్తుందనో, బాధపడతారనో ప్రతిసారి సర్దుకుపోవద్దు. నిజంగా ఏమైనా మీ వల్ల పొరపాటు జరిగితే సారీ చెప్పండి అంతే తప్ప అవతలి వారు ఎమోషనల్‌ అవుతారని అన్నింటికీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్