పిల్లలు.. బుల్లి రైతులు

మొక్క అంకురించింది మొదలు ఫలాలు ఇళ్లకు చేరే వరకూ అడుగడుగునా రసాయనాలలో మగ్గుతూ మన ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తాయి. ఈ నేపథ్యంలో ఎందరో మహిళలు కిచెన్‌ గార్డెనింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పిల్లలనూ ఇటువైపు మళ్లిస్తున్నారు. అందుకు నిపుణులు ఇస్తున్న కొన్ని సూచనలు...

Published : 24 Dec 2021 00:57 IST

మొక్క అంకురించింది మొదలు ఫలాలు ఇళ్లకు చేరే వరకూ అడుగడుగునా రసాయనాలలో మగ్గుతూ మన ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తాయి. ఈ నేపథ్యంలో ఎందరో మహిళలు కిచెన్‌ గార్డెనింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పిల్లలనూ ఇటువైపు మళ్లిస్తున్నారు. అందుకు నిపుణులు ఇస్తున్న కొన్ని సూచనలు...

* పిల్లలు గాడ్జెట్స్‌కు బానిసలైపోతున్నారని ఆందోళన చెందొద్దు  వాళ్ల ధ్యాసను మళ్లించాలి. అందుకు గార్డెనింగ్‌ భేషైన వ్యాపకం. యంత్ర ప్రపంచం నుంచి అందాల ప్రకృతిలో అడుగుపెడతారు. సహజత్వాన్ని ఆస్వాదిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. తోట బాధ్యత పెద్దలదే అయినా కొన్ని మొక్కలు, కొంత స్థలాన్ని పిల్లలకు కేటాయించండి. ఏయే పూల మొక్కలు, కాయగూరలు, ఫ్యాన్సీ మొక్కలను నాటడానికి అవకాశం ఉందో వివరించి, ఇష్టమైనవి ఎంచుకోమని చెప్పండి. ఆ స్థలానికి మీ చిన్నారిని యజమానిని చేసి, వారి పేరుతో చిన్నబోర్డు తగిలించేయండి. ఆ జాగాలో ఎన్ని మొక్కలు ఎంత బాగా పెంచుతావో అంటూ సవాలు విసరండి. పిల్లలు ఇలాంటి ఛాలెంజ్‌లను నిర్లక్ష్యం చేయరు. తమ సత్తా ఏమిటో చూపాలనుకుంటారు. ఇది మానసికంగా, శారీరకంగా కూడా మేలు చేసే పని.

* ఇంట్లోనే ఇద్దరు పిల్లలుంటే వాళ్లే పోటీ పడతారు. లేదంటే ఇరుగు పొరుగు పిల్లలు లేదా క్లాస్‌మేట్స్‌తో పోటీపెట్టుకోమని చెప్పండి. ఇక తోట పనులు ఎంతో హుషారుగా చేస్తారు. ఆ ఉత్సాహం చదువులోనూ రాణించేందుకు ఉపయోగపడుతుంది.

* చిన్నారి స్థలంలో పూవు పూసినా, కాయ కాసినా ‘చిన్నవయసులోనే గొప్ప రైతువైపోయా’వంటూ మెచ్చుకోండి. ఆ ప్రశంసలు వాళ్లకి ఎనలేని ఆనందాన్నిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్