అన్నీ చూసి అడుగేయండి

జీవితంలో అతి పెద్ద నిర్ణయమైన పెళ్లి విషయంలో... ఈడు, జోడు, ఉద్యోగం, సంపాదన.. మాత్రమే కాక ఇంకొన్నిటిని సరి చూసుకోవాలి, తెలుసుకోవాలి. ఆపైనే..  ముందడుగు వేయాలి...

Published : 03 Jan 2022 01:31 IST

జీవితంలో అతి పెద్ద నిర్ణయమైన పెళ్లి విషయంలో... ఈడు, జోడు, ఉద్యోగం, సంపాదన.. మాత్రమే కాక ఇంకొన్నిటిని సరి చూసుకోవాలి, తెలుసుకోవాలి. ఆపైనే..  ముందడుగు వేయాలి...

* గతంలో ప్రేమిస్తే వాళ్లతో ఇప్పటికీ మాట్లాడు తున్నారా? విడిపోవడానికి కారణాలు వంటివి ముందే తెలుసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో అనుమానం, అపార్థాలకు తావుండదు.

* ఇద్దరి లక్ష్యాలు, వాటిని అందుకునే క్రమంలో అవతలి వ్యక్తి ఎక్కడెక్కడ సర్దుకుపోవాల్సి ఉంటుందో.. మీ ఇద్దరి కోసం మీరు చేయగలిగినవేంటో కూడా ప్రస్తావించుకోవాలి. నచ్చిన రాజకీయ పార్టీలు, హీరోలు, రచయితలు.. ఇవీ ఒక్కోసారి పెద్ద గొడవలకు దారి తీస్తాయి. వీటి గురించీ తెలుసుకోవాలి.

* ఒకరి నుంచి మరొకరు ఏం ఆశిస్తున్నారో కూడా తెలుసుకుంటే బంధంపై ఇద్దరూ ఎంతవరకూ సీరియస్‌గా ఉన్నారో అర్థమవుతుంది. అలవాట్ల గురించీ తెలుసుకుంటే.. భవిష్యత్‌లో సమస్య ఉండదు. చివరగా.. అతి కోపం, ఒత్తిడిలో చేసే పని సహా చర్చించుకోండి. మార్చుకోగలం/ సర్దుకుపోగలం అనుకుంటే ముందుకు వెళ్లండి. లేదూ.. పొసగని విషయం పెద్దలతో చెప్పేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్