చిన్నప్పుడే.. నేర్పాలి!

సంస్థలు నియామకాల్లో అభ్యర్థుల నుంచి కొన్ని నైపుణ్యాలను ఆశిస్తాయని తెలుసు కదా! ఇవి ఉద్యోగానికే పరిమితం కావు వ్యక్తిత్వానికీ ముడిపడి ఉంటాయి! వీటిలో కొన్నింటిని చిన్న వయసులోనే నేర్పించొచ్చు. అవేంటంటే..

Updated : 06 Jan 2022 05:09 IST

సంస్థలు నియామకాల్లో అభ్యర్థుల నుంచి కొన్ని నైపుణ్యాలను ఆశిస్తాయని తెలుసు కదా! ఇవి ఉద్యోగానికే పరిమితం కావు వ్యక్తిత్వానికీ ముడిపడి ఉంటాయి! వీటిలో కొన్నింటిని చిన్న వయసులోనే నేర్పించొచ్చు. అవేంటంటే..

* పిల్లలకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి! మీరు హైరానా పడకండి. చిన్నదే అనిపిస్తే సాయం చేయకండి. పరిష్కారాన్ని వాళ్లనే ఆలోచించమనండి. అవసరమైతే చిన్న చిన్న సూచనలు చేస్తే సరి! దాంతో వారికి సమస్యా పరిష్కార నైపుణ్యాలు అలవడతాయి.
* వాళ్ల దుస్తులు, ఆహారం, బొమ్మల ఎంపిక నిర్ణయాన్ని వాళ్లకే ఇస్తుండండి. అయితే రెండు మాత్రమే, ఇంత ధరలోనే వంటి నిబంధనలు తప్పనిసరి. దీనివల్ల ఆలోచనశక్తి, విశ్లేషణ, ఎంపిక, నిర్ణయం తీసుకోగల నైపుణ్యాలూ అలవడతాయి.
* సమయపాలన.. ఇది పెద్దా చిన్నా అందరికీ ముఖ్యమే. పొద్దున్నే లేపడం, పదే పదే సమయం గుర్తుచేస్తుండటం లాంటివి చేస్తుంటే వాళ్లకు అలవాటు అవదు కదా! ఓ అలారం కొనివ్వండి. సమయానికి వాళ్లనే సిద్ధమవమనండి. ఆలస్యమై పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వచ్చినా మీరు మనసు కఠినం చేసుకోవాల్సిందే!
* మొక్కల పెంపకం, వాటికి నీళ్లు పోయడం, చెట్ల దగ్గర చెత్తను శుభ్రం చేయడం వంటి వాటిల్లో పిల్లల్నీ భాగస్వాముల్ని చేయండి. బాధ్యత తెలుస్తుంది, పర్యావరణంపై అవగాహన ఏర్పడుతుంది. దీని వల్ల పిల్లల్లో సున్నితత్వం పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్