పిల్లలతో అడుగు కలపండి

ఈ కాలంలో బారెడు పొద్దెక్కే వరకు పెద్దలకే మంచం దిగాలని అనిపించదు. ఇక పిల్లల సంగతి వేరే చెప్పాలా! కానీ చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారం మాత్రమే కాదు... వ్యాయామం కూడా ముఖ్యం. మరి ఆ వ్యాయామాలను చేయించాలంటే పెద్ద వాళ్లూ... పిల్లలతో కలిసి అడుగేసి ఉత్సాహాన్ని నింపాల్సిందేనని సూచిస్తున్నారు నిపుణులు...

Updated : 08 Jan 2022 06:31 IST

ఈ కాలంలో బారెడు పొద్దెక్కే వరకు పెద్దలకే మంచం దిగాలని అనిపించదు. ఇక పిల్లల సంగతి వేరే చెప్పాలా! కానీ చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారం మాత్రమే కాదు... వ్యాయామం కూడా ముఖ్యం. మరి ఆ వ్యాయామాలను చేయించాలంటే పెద్ద వాళ్లూ... పిల్లలతో కలిసి అడుగేసి ఉత్సాహాన్ని నింపాల్సిందేనని సూచిస్తున్నారు నిపుణులు.

శారీరక సామర్థ్యంపై పిల్లలకు అవగాహన కలిగించడం సులువు కాదు. అందుకే... డ్యాన్స్‌లా చేయిస్తే ఆసక్తిగా ముందు కొస్తారు. అది వ్యాయామంగా మారి వారి కండరాలు బలోపేతమవుతాయి. ఆన్‌లైన్‌లో డ్యాన్స్‌ తరహాలో పలు వ్యాయామ తరగతులు నిర్వహిస్తున్నారు. పెద్దలు కూడా వారితో అడుగు కదిపితే, పిల్లల్లోనూ ఉత్సాహం పెరుగుతుంది. దాంతో ఇద్దరికీ శారీరక, మానసికారోగ్యం.

ఆదర్శంగా.. పిల్లలను వ్యాయామం చేయమని... పెద్దవాళ్లు టీవీ ఎదుటో, ఫోన్లతోనో కూర్చోకూడదు. ఆరోగ్యకరమైన అలవాట్లను చిన్నారులు పెద్దవాళ్ల నుంచే నేర్చుకుంటారు. కుటుంబసభ్యులంతా కలిస్తే ఆ ఉత్సాహమే వేరు. ప్రతి ఆటా, డ్యాన్స్‌లోనూ పిల్లలనే నాయకత్వం వహించమంటే చాలు. ఇక వెనుకడుగు వేయరు.

కొత్తగా... ఆటపాటలతో మొదలైన వ్యాయామాలు నెమ్మదిగా కొత్త విషయాలవైపు మరలేలా పిల్లలను ఉత్సాహపరచాలి. సైకిల్‌ తొక్కడం లేదా ఈత, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ వంటివి నేర్చుకునేలా ప్రోత్సహించాలి. ఇవి వారిలో శ్రద్ధను పెంచుతాయి. ఆటల్లో చిన్నచిన్న పోటీలు పెట్టి బహుమతులను అందించాలి. వీటిల్లో పెద్దవాళ్లు కూడా పాల్గొంటే అందరికీ ఆరోగ్యం, సంతోషం. బంధాలూ బలపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్