ఎదురు చెబుతున్నారా!

పిల్లలు ఎదురుచెబితే మహా కోపం వస్తుంది కదూ! అసలు వాళ్లెందుకలా ప్రవర్తిస్తున్నారో, అలాంటి సందర్భాల్లో ఎలా అదుపు చేయాలో తెలీక అమ్మానాన్నలు తలపట్టుకోవడం తెలిసిందే!

Updated : 02 Feb 2022 05:03 IST

పిల్లలు ఎదురుచెబితే మహా కోపం వస్తుంది కదూ! అసలు వాళ్లెందుకలా ప్రవర్తిస్తున్నారో, అలాంటి సందర్భాల్లో ఎలా అదుపు చేయాలో తెలీక అమ్మానాన్నలు తలపట్టుకోవడం తెలిసిందే! ఈ సమస్య గురించి మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే...

పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణ కోరుకుంటారు. తమకు అమ్మానాన్నలు ప్రాధాన్యం ఇవ్వడం లేదనిపిస్తే ఆ బాధతో ఎదురుచెబుతారు. కనుక మనసులో ఇష్టముంది కదా, దాన్ని పైకి వ్యక్తం చేయాల్సిన పనేముంది అనుకోవద్దు. వాళ్ల కోసం కొంత సమయం కేటాయించండి. ఆత్మీయంగా మాట్లాడండి. లేదంటే తమను పక్కన పెడుతున్నారనే భావనతో ఒంటరితనం అనుభవిస్తారు. ఆ దిగులు పెడసరంగా మాట్లాడేట్లు చేస్తుంది.

చిన్నారులకు ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిందే! కానీ ప్రతి విషయంలో అదుపు చేస్తూ ఆంక్షలు విధించడం సరికాదు. దానివల్ల వాళ్లలో ఒక రకం కసి, కోపం బయల్దేరతాయి. సరదాలూ సంతోషాలూ కూడా అవసరమేనని మర్చిపోవద్దు. ‘ఈ పాఠం నేర్చేసుకున్నావంటే ఆడుకోవడానికి పంపిస్తాను.. ముందు పండ్లరసం తాగితే ఆనక నీకిష్టమైన ఫ్రెంచ్‌ఫ్రైస్‌ ఇస్తా’ తరహాలో చెప్పి చూడండి. ఆశించిన ఫలితం కనిపిస్తుంది.

పిల్లలు కటువుగా మాట్లాడినప్పుడు కోప్పడటం, కొట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. కొద్దిసేపు ఏమీ మాట్లాడొద్దు. తర్వాత ఆ పద్ధతి ఎంత అనర్థదాయకమో, పెద్దల పట్ల వినయ విధేయతలు లేకుంటే భవిష్యత్తులో ఎంత నష్టపోయేదీ వివరించి చెప్పండి.

ఏ విషయంలోనయినా వ్యతిరేకత ఉంటే తప్పకుండా వ్యక్తం చేయొచ్చు.. కానీ చెప్పే పద్ధతి సౌమ్యంగా ఉండాలి, లేదంటే వ్యక్తిత్వలోపం అవుతుందని అర్థమయ్యేలా చెప్పండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్