మూడు ముళ్లకు ముందే ముచ్చటించండి!

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం. అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే తర్వాత జీవితం సంతోషానికి చిరునామా అవుతుంది. అందుకే మూడు ముళ్లు, ఏడడుగులు వేసే ముందే కొన్ని విషయాలు

Published : 10 Feb 2022 00:12 IST

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం. అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే తర్వాత జీవితం సంతోషానికి చిరునామా అవుతుంది. అందుకే మూడు ముళ్లు, ఏడడుగులు వేసే ముందే కొన్ని విషయాలు చర్చించాలి. అవేంటంటే..

* జీతం, సంపాదన, ఆస్తులు, అప్పులు.. ఈ విషయాలన్నీ నిజాయతీగా చెప్పుకోవాలి. ఖర్చులు, పొదుపు వివరాలూ చర్చిస్తే.. అనుమానాలు, అపోహలకు తావుండదు.

* పెళ్లయ్యాక పెద్దలతో కలిసి ఉండాలా? వేరు కాపురం పెట్టాలా? ముందే స్పష్టత ఉంటే మంచిది. చాలా కాపురాల్లో భేదాభిప్రాయాలకు ఇదే కారణం. వేర్వేరుగా ఉండాలని భావిస్తే.. ఎదుటివాళ్ల మనసు నొప్పించకుండా కారణాలు స్పష్టంగా విడమరిచి చెప్పగలగాలి.

* కెరియర్‌, వ్యాపారం, కుటుంబం.. ఈ విషయాల్లో చాలామందికి దీర్ఘకాలిక లక్ష్యాలుంటాయి. పెళ్లయ్యాక కూడా కొనసాగించాలంటే భాగస్వామి సహకారం తప్పనిసరి. ఈ వివరాలూ కాబోయే శ్రీమతి/ శ్రీవారికి తెలియజేస్తే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్