ప్రేమ కానుకగా...

ప్రేమికుల దినోత్సం దగ్గర పడుతోంది. ప్రియమైన మీ జీవిత భాగస్వామికి మీరిచ్చే ప్రేమ కానుక ఎప్పటికీ మరవలేనిదిగా ఉండాలి. బజారు నుంచి తెచ్చే కానుకలకన్నా... మీరే స్వయంగా ఇంట్లోనే తయారు చేసి ఇచ్చి చూడండి. ఆ అనుభవం మరింత మధుర జ్ఞాపకంగా మీ మనసుల్లోనూ నిలిచిపోతుంది.

Updated : 11 Feb 2022 05:30 IST

ప్రేమికుల దినోత్సం దగ్గర పడుతోంది. ప్రియమైన మీ జీవిత భాగస్వామికి మీరిచ్చే ప్రేమ కానుక ఎప్పటికీ మరవలేనిదిగా ఉండాలి. బజారు నుంచి తెచ్చే కానుకలకన్నా... మీరే స్వయంగా ఇంట్లోనే తయారు చేసి ఇచ్చి చూడండి. ఆ అనుభవం మరింత మధుర జ్ఞాపకంగా మీ మనసుల్లోనూ నిలిచిపోతుంది.

వరుసలో.. మీకు పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరూ తీసుకున్న ఫొటోలను ఎంచుకోండి. అన్నింటినీ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత దళసరిగా ఉండే తెలుపు కాగితాన్ని తీసుకుని ఫొటోల పరిమాణంలో కత్తిరించుకోవాలి. చిత్రంలో చూపించినట్లుగా ఒకవైపు వచ్చేలా ప్రతి కాగితానికీ ఒక ఫొటోను అతికించాలి. పది ఫొటోలు పట్టేలా చిన్న బాక్సును సిద్ధం చేసుకుని అందులో అడుగున మొదటి ఫొటో ఉన్న కాగితం వైపు వచ్చేలా అంటించండి. వరుసగా అన్నింటినీ మడతపెట్టి బాక్సును మూసేయాలి. పెట్టెపైన అందమైన మెరుపుల కాగితాన్ని అంటించి చిన్న హృదయాకారాన్ని తీర్చిదిద్దండి. అంతే మీ జ్ఞాపకాలు వరుసగా కనిపిస్తుంటే భాగస్వామి కళ్లలో మెరిసే మెరుపు జీవితంలో మరవలేరు.

సీసాలో... అందమైన ఆకారంలో ఉన్న ఖాళీ సీసాలో జతగా ఉన్న మీ ఫొటోను లోపలివైపు కనిపించేలా అంటించాలి. వీలైతే నాలుగువైపులా ఒక్కొక్క ఫొటో వచ్చేలా చేస్తే చాలు. ఈ సీసాను తాజా పూలుంచిన వాజ్‌ పక్కన ఉంచి ఉదయాన్నే ఆశ్చర్యపరచండి. అలాగే పడకగది, డ్రెస్సింగ్‌ చేసుకునే చోట హృదయాకారాల్లో రంగురంగుల కాగితాలను కట్‌చేసి వేలాడేలా అలంకరిస్తే చాలు. మీ ప్రేమ ప్రతిఫలించేలా గది అంతా తళుక్కుమంటుంది. ఎరుపువర్ణం కాగితంతో గులాబీలను తయారుచేసి వాటి మధ్య చాక్లెట్‌ నుంచి ఆ తీయని పూల గుచ్ఛాన్ని మీవారికి ప్రేమగా అందించండి. ఒకేలా ఉన్న నాలుగు ఖాళీ సీసాలకు తెలుపు పెయింటింగ్‌ వేసి ఆరనిచ్చి వాటిపై ఎరుపురంగు స్కెచ్‌తో నాలుగింటిపై తలా ఒకదానిపై ఎల్‌,ఓ,వీ,ఈ ఆంగ్ల అక్షరాలను తీర్చిదిద్దాలి. వాటిలో ఎరుపు గులాబీలను నింపి టేబుల్‌పై ఉంచండి. ఇవన్నీ మీ భాగస్వామిపై మీకున్న ప్రేమను చాటి చెబుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్