చేయండి.. చేయించండి..

ఉద్యోగినుల పరిస్థితి రెండు పడవల మీద ప్రయాణమే. ముఖ్యంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అది మరీ కష్టం. కనుకనే పిల్లల పెంపకం కోసం 43 శాతం మంది మహిళలు ఉద్యోగాలు వదులుకుంటున్నట్టుగా సర్వేల్లో తేలింది. కొందరు మహిళలు రెండు బాధ్యతలూ విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు

Published : 19 Feb 2022 00:48 IST

ఉద్యోగినుల పరిస్థితి రెండు పడవల మీద ప్రయాణమే. ముఖ్యంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అది మరీ కష్టం. కనుకనే పిల్లల పెంపకం కోసం 43 శాతం మంది మహిళలు ఉద్యోగాలు వదులుకుంటున్నట్టుగా సర్వేల్లో తేలింది. కొందరు మహిళలు రెండు బాధ్యతలూ విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లు అనుసరిస్తున్న మార్గాలివి..
* చేయాల్సిన పనులకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ సమయంలో ఇంత పని చేసేయాలి అనే నియమం పెట్టుకుంటే అది వేగంగా, సక్రమంగా జరిగిపోతుంది. లేదంటే కాలయాపనతో పని పూర్తవ్వదు, ఒత్తిడి పెరుగుతుంది.
* ఉద్యోగినులు తాము ఒంటరులు కాదని గుర్తుంచుకోవాలి. భాగస్వామితో ముందుగానే చర్చించి తోడ్పాటు కావాలని చెప్పి, కొన్ని పనులు అప్పగించండి. తన ఇబ్బందిని చెప్పకుండా అన్నీ చేసేస్తే ఆనక మితిమీరిన పనిభారంతో శారీరక, మానసిక అనారోగ్యాలు తప్పవు. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటే ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉండొచ్చు. కనుక పని చేయండి, చేయించండి!
* ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే పగలు పిల్లల ఆలనాపాలనా వాళ్లు చూసుకోగలుగుతారు. లేదంటే పిల్లలను కనిపెట్టుకుని ఉండటం కోసం ఆయాని మాట్లాడండి. లేదంటే డే కేర్‌ సెంటర్‌లో చేర్చండి.
*పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌ ఏం చేయాలి, ఏం కూరలు లాంటివి రాత్రే నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకోవడం సులువైన పద్ధతి. రాత్రిపూటే కూరలు తరిగి ఉంచితే ఉదయం హడావుడి లేకుండా వంట పని పూర్తవుతుంది.
* ఇంట్లో అందరికీ క్రమశిక్షణ అలవాటు చేయండి. అందరూ ఉదయాన్నే లేచి ఎవరి పనులు వాళ్లు చేసుకునేలా తర్ఫీదివ్వండి. దుస్తులూ సాక్సుల్లాంటివన్నీ అందించాలంటే సమయం సరిపోకపోవడమే కాదు, వారికి బాధ్యత అలవడదు కూడా.
* చాలా ఇళ్లల్లో టీవీ వల్ల సమయమంతా వృథాగా గడిచిపోతుంటుంది. రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడమూ కద్దు. ఇంటిల్లిపాదీ స్క్రీన్‌ టైం తగ్గించేలా చూడండి.
* యాంత్రికతను నివారించేలా వారాంతంలో సినిమాకో షికారుకో వెళ్లండి. ఇది అలసటను తగ్గించి కొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్