ఏం చెబుతున్నారో.. వినండి

పిల్లల పెంపకం సవాలుతోపాటు బహుమానం కూడా అంటారు మానసిక నిపుణులు. వారితో కలిసి గడిపే సమయంలో దక్కే ఆనందం, ప్రశాంతత ఎందులోనూ ఉండదు. అయితే పిల్లలూ ఆ సంతోషాన్ని

Published : 23 Feb 2022 00:35 IST

పిల్లల పెంపకం సవాలుతోపాటు బహుమానం కూడా అంటారు మానసిక నిపుణులు. వారితో కలిసి గడిపే సమయంలో దక్కే ఆనందం, ప్రశాంతత ఎందులోనూ ఉండదు. అయితే పిల్లలూ ఆ సంతోషాన్ని సొంతం చేసుకోవాలంటే కొన్ని సూచనలను పాటించాలంటున్నారు.

* స్వేచ్ఛనిస్తూ... పెద్దవాళ్లు సూచించిన ఆహారంపై పిల్లలకు ఆసక్తి లేకపోవచ్చు. అంతమాత్రాన ఒత్తిడి తేవొద్దు. వారికి నచ్చినవి ఎంచుకునే స్వేచ్ఛనిస్తూనే ఆరోగ్యమైనవీ అలవాటు చేయండి. ముందు మీరు ఆ ఆహారాన్ని వారెదుట తీసుకోవడం, పండ్లను వారికి నచ్చేలా స్మూతీలా చేసివ్వడం లాంటివి చేయండి. ప్రతిదాన్నీ ప్రత్యేకంగా కనిపించేలా చేయండి. నీరు, పండ్ల రసాలను అలవరచాలి. క్రమేపీ వారిలో మార్పు వస్తుంది. 

* ప్రవర్తన.. చిన్నారులు ఏదైనా పొరపాటు చేసినా, చదువులో వెనుకబడ్డా అరవడం, కోప్పడటం చేయొద్దు. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండి, ఆ తర్వాత మాట్లాడండి. ఆ సమయంలోనూ మీ ప్రేమనే ప్రదర్శించండి. వాళ్లు బాధపడుతోంటే జరిగిన పొరపాటు గురించి ఆలోచించకుండా, మరోసారి చేయకుండా చూసుకోమని ప్రోత్సహించండి.. వారిలో ఆలోచనాశక్తి పెరుగుతుంది. ఆ చిన్నారి మీకు ‘ఓ కానుక’ అనే విషయం వారికి తెలియజేసేలా ప్రవర్తిస్తే చాలు. మీ ప్రేమ వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుకునేలా ఉపయోగపడుతుంది.

* వినండి... తమ లక్ష్యం, కలల గురించి అప్పుడప్పుడు పిల్లలు తమ మాటల్లో చెబుతుంటారు. వాటిని విని ప్రోత్సహిస్తే వారిలో ఒత్తిడి, ఆందోళనకు చోటుండదు. కొందరు పిల్లలు చిన్నతనం నుంచే పలు రంగాల్లో సృజనాత్మకత ప్రదర్శిస్తుంటారు. వాటినీ గుర్తించి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఇతరులకు స్ఫూర్తిగా మారడానికి పునాది వేసిన వారవుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్