నిఘా పెడుతున్నారా?

కొందరు అమ్మానాన్నలు పిల్లల ప్రతి అడుగుపైనా ఆంక్షలు పెడుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు మానసిక నిపుణులు. తాజాగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు, సామాజిక సేవకురాలు సుధామూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పిల్లల పెంపకంపై సూచనలు, సలహాలు చెప్పుకొచ్చారిలా..

Updated : 04 Mar 2022 04:57 IST

కొందరు అమ్మానాన్నలు పిల్లల ప్రతి అడుగుపైనా ఆంక్షలు పెడుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు మానసిక నిపుణులు. తాజాగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు, సామాజిక సేవకురాలు సుధామూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పిల్లల పెంపకంపై సూచనలు, సలహాలు చెప్పుకొచ్చారిలా..

స్నేహం.. తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్నేహం, పరస్పర గౌరవం ఉండాలి. అంతేకానీ నిఘా వేసినట్లుగా ఉంటే.. వారికి ఊపిరి ఆడదు. ఒత్తిడిగానూ భావించొచ్చు. మీ అభిప్రాయాల్ని చిన్నారులపై రుద్దడానికి ప్రయత్నించకూడదు. మారుతున్న జీవనశైలికి తగినట్లుగా అభిప్రాయ స్వేచ్ఛ ఇవ్వాలి. వారి ఇష్టాయిష్టాలకూ విలువనివ్వాలి. లేదంటే వారి ఆలోచనా సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా, ఆలోచనలు పంచుకునేలా చూడండి. అప్పుడే నచ్చిన రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోగలుగుతారు.

ఉదాహరణగా... నియమాలను పెట్టి పాటించమనొద్దు. మీ అలవాట్లనూ వారిపై రుద్దొద్దు. పుస్తకపఠనం, తోటపని, వ్యాయామం వంటి అభిరుచులను పరిచయం చేయాలనిపిస్తే ముందు మీరు ఆచరించాలి. అప్పుడు వాళ్లూ మిమ్మల్ని ఉదాహరణగా తీసుకొని ఆసక్తి కలిగినవి ప్రయత్నిస్తారు. మీరే వారికి హీరోలు. మీ నుంచే వారు స్ఫూర్తి పొందుతారు. పిల్లలు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో.. అలాగే మీరూ వారెదుట ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడు పిల్లలూ మిమ్మల్ని అనుకరిస్తారు, అనుసరిస్తారు. అలాకాకుండా బలవంతంగా నేర్పాలనుకుంటే ఒత్తిడి పెంచినవారు అవుతారు.

సాధారణ జీవితం... స్థాయిని దాటి దేన్నీ అందించొద్దు. సాధారణ జీవితాన్ని మీరనుభవిస్తూ వాళ్లకీ అందించండి. అలాకాకుండా ఉన్న దానికన్నా ఎక్కువగా జీవించడానికి ప్రయత్నిస్తే వాళ్లూ అలాగే ఆశిస్తారు. భవిష్యత్‌లో ఇది వాళ్లకి ముప్పు కలిగించొచ్చు. అందరితో కలిసి జీవించడం, ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడాన్ని నేర్పండి. ఆడంబరంగా వేడుకలు నిర్వహించడం కంటే.. దానిలో కొంత మొత్తాన్ని పేదలకు పంచేలా చూడండి. సహాయ గుణంతోపాటు దయ, ప్రేమ వంటివి నేర్పిన వారు అవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్