అభిప్రాయం నచ్చకపోతే!

భార్యాభర్తలు ఒక్కటే. అలాగని మాట, ఆలోచనలు ఒకేలా ఉండాలనేం లేదు. కానీ ఇద్దరి మధ్యా దూరం పెరగడానికి మాత్రం ఇవే చాలాసార్లు కారణమవుతాయి. కాబట్టి..

Updated : 27 Apr 2022 04:19 IST

భార్యాభర్తలు ఒక్కటే. అలాగని మాట, ఆలోచనలు ఒకేలా ఉండాలనేం లేదు. కానీ ఇద్దరి మధ్యా దూరం పెరగడానికి మాత్రం ఇవే చాలాసార్లు కారణమవుతాయి. కాబట్టి..

* అవతలి వ్యక్తి చెప్పింది నచ్చకపోతే తిరస్కరించడంలో తప్పు లేదు. కానీ వాదులాడుకోవద్దు. అలాగని నచ్చకపోయినా నటిస్తూ వస్తే అదీ ఒత్తిడి పెంచి, అవతలి వ్యక్తిపై వ్యతిరేకతకు దారి తీయొచ్చు. కాబట్టి, మధ్యే మార్గాలను ఆలోచించండి.

* బంధం అనేది ఆట కాదు. కాబట్టి, వాదనల్లో గెలవడానికి ప్రయత్నించకండి. అవతలి వ్యక్తి ఏదో అన్నారని మీరూ నాలుగు మాటలు అనేస్తే అహం శాంతిస్తుంది. కానీ అది మనం ప్రేమించే వ్యక్తిని దూరం చేయొచ్చు. కాబట్టి, మీ దృష్టి ఎప్పుడూ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంపైనే ఉండాలి.

* కోపం ఎంత చెడ్డది! మనసు, మెదడు రెంటిపైనా ఆధిపత్యం చెలాయిస్తుంది. మాట జారనివ్వగలదు. పర్యవసానం.. ఎదుటి వ్యక్తి మనసుకి గాయం. కోపం వచ్చిందనుకోండి.. వెంటనే ప్రశ్నించక ముందు మిమ్మల్ని మీరు శాంత పరచుకోండి. కోపమంతా తగ్గిందన్నాకే ఈ విషయంపై మాట్లాడండి.

* ఏదైనా నచ్చకపోవడానికి కొన్నిసార్లు గతమూ కారణమవొచ్చు. ఒక విషయంపై అవతలి వ్యక్తి సంయమనం కోల్పోతున్నారంటే దాన్ని పదేపదే చర్చించకపోవడమే మేలు. తర్వాత నెమ్మదిగా విషయాన్ని తెలుసుకోండి. అవసరమైతే దాన్నుంచి వాళ్లని బయటపడేయగల మార్గాన్ని అన్వేషించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్