బంధం కావాలి శాశ్వతం

రమకు ఎక్కడికెళ్లినా స్నేహితులే. ఇంట్లో తనులేకపోతే భర్త, పిల్లలకు బోర్‌. తన చెల్లి నిత్యతో మాత్రం ఎవరూ కలవరు. ఎవరితోనైనా స్నేహం ఏర్పడినా అది మూణ్ణాళ్ల ముచ్చటే. స్నేహం, ప్రేమ, దాంపత్యం.. ఏ బంధమైనా.. శాశ్వతంగా నిలవాలంటే  నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి...

Published : 01 Oct 2022 00:20 IST

రమకు ఎక్కడికెళ్లినా స్నేహితులే. ఇంట్లో తనులేకపోతే భర్త, పిల్లలకు బోర్‌. తన చెల్లి నిత్యతో మాత్రం ఎవరూ కలవరు. ఎవరితోనైనా స్నేహం ఏర్పడినా అది మూణ్ణాళ్ల ముచ్చటే. స్నేహం, ప్రేమ, దాంపత్యం.. ఏ బంధమైనా.. శాశ్వతంగా నిలవాలంటే  నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి...

తరులపట్ల నిజాయతీగా ఉంటే వారితో బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది. దంపతుల మధ్యనైనా ఒకరికొకరు ఎంతగా ప్రేమను పంచుకుంటారో దాపరికాలకు అంత దూరంగా ఉండాలి. సమస్యలెన్ని వచ్చినా ఎదుటివారితో పంచుకోవడం, కలిసి చర్చించి పరిష్కరించడంలో వారికి భాగస్వామ్యం ఇవ్వడం వంటివి మీ నిజాయతీని చాటతాయి. దాంతో అవతలి వారూ అదే స్థాయిలో ప్రేమను పంచడానికి ముందుకొస్తారు. ఎటువంటి క్లిష్ట సందర్భమూ  మమ్మల్ని విడదీయలేదనే ధీమా ప్రేమను మరింత బలంగా మారుస్తుంది.  

స్వీకరణ.. నచ్చిన వారిలోని ప్రత్యేకతలను మాత్రమే కాదు వారి బలహీనతలనూ స్వీకరించగలగాలి. వాటిని మార్చడానికి జాగ్రత్తగా ప్రయత్నించాలి తప్ప, విమర్శించి దూషించకూడదు. ఆ బలహీనత వల్ల నష్టాన్ని సున్నితంగా వివరించాలి. ఏదేమైనా ఎదుటి వ్యక్తిని ప్రేమించడం మాత్రం మానకూడదు. వారెలా ఉన్నారో అలాగే స్వీకరించాలి. నువ్వు నాకు నచ్చినట్టు మారితేనే ప్రేమిస్తా అంటే అవతలి వ్యక్తి వ్యక్తిత్వానికి విలువనివ్వనట్లే. ఈ తరహా బంధం ఎంతో కాలం నిలవదు.

అనుమానం.. భాగస్వామి ప్రేమను అనుమానిస్తే వారిని అవమానించినట్లే. ఈ అనుమానం బంధాన్ని బలహీనపరుస్తుంది. ఎదుటివ్యక్తిలో మార్పును గుర్తించి, నిజంగానే వారిష్టపడుతున్నారా అని అనిపించినప్పుడు  వారినే అడిగి తెలుసుకోగలగాలి. అక్కడితో సంశయం దూరమవుతుంది. అలాకాక ఎదుటి వారి ప్రేమపై అనుమానాన్ని పెంచుకుంటే.. చెడు ప్రభావం పడుతుంది. అవతలి వారిలో ప్రేమ తగ్గడానికి అవకాశం ఉంది.

స్వేచ్ఛ.. మనసులో ఉన్నవారి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. చిన్నచిన్న విషయాల్లోనూ ప్రవేశించి, అడగకుండానే సలహాలివ్వడం, సరైన రీతిలో ఆలోచించడం లేదంటూ విమర్శించడం, అవతలి వారు తమకన్నా తక్కువనే భావంతో ప్రవర్తించడం వంటివన్నీ ప్రేమబంధాన్ని బలహీనపరుస్తాయి. భాగస్వామికి భావస్వేచ్ఛతోపాటు కొంత స్పేస్‌ ఇవ్వాలి. అందులోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించకుండా పరస్పరం గౌరవించుకుంటేనే ఆ బంధం శాశ్వతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్