ఇకనుంచైనా మారాలని!

అక్కడ అమ్మాయిల్ని బడికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడతారు. గత డిసెంబరు నుంచి ఇప్పటివరకూ చూస్తే వెయ్యిమంది ఆడపిల్లల ఆచూకీ తెలియలేదు.

Updated : 08 Sep 2022 15:38 IST

అక్కడ అమ్మాయిల్ని బడికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడతారు. గత డిసెంబరు నుంచి ఇప్పటివరకూ చూస్తే వెయ్యిమంది ఆడపిల్లల ఆచూకీ తెలియలేదు.

అందుకే టీనేజీలో అడుగుపెట్టగానే ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి సిద్ధమవుతారు అక్కడివాళ్లు. నైజీరియాలోని కానో పట్టణ పరిస్థితి ఎన్నో ఏళ్లుగా ఇలానే ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చింది కబారా అనే స్వచ్ఛంద సంస్థ. ఆడపిల్లలకు రోబోటిక్స్‌, కంప్యూటింగ్‌, సైన్సు, లెక్కల్లో ప్రత్యేకంగా తర్ఫీదునిస్తోంది. ‘ఇలా శిక్షణ ఇవ్వడం వల్ల అమ్మాయిలు ఉపాధి సాధిస్తారనీ, పెళ్లిచేసుకున్నా వాళ్ల కుటుంబాలని చక్కగా మేనేజ్‌చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ సంస్థను స్థాపించా’ అంటున్నారు హదీజా అనే ఇంజినీర్‌. కానోలో అమ్మాయిలు కిడ్నాప్‌లకు గురికావడానికి వీలుకాని అత్యంత సురక్షిత ప్రాంతాన్ని ఎంచుకుని కబారాని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ మూడువందలమంది ఆడపిల్లలకు మాత్రమే ఈ శిక్షణ అందినా తర్వాతి తరాల ఆడపిల్లల్లో ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని చెబుతున్నారు నిర్వాహకులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్