ఈమె ఫొటోలు చూస్తే కళ్లు తిరుగుతాయ్‌!

ప్రమాదం అంటే ఏమిటంటే ఏం చెబుతారు? ఏంటీ.. మాటల కోసం వెతుక్కుంటున్నారా! అంత అవసరం లేదండీ! ఈసారి నుంచి ఈ అమ్మాయి ఫొటోలు చూపించండి చాలు. ఆ... అక్కడెందుకు నిలబడిందో అంటారా... అయితే కథనం చదవండి...

Updated : 24 Oct 2021 05:27 IST

ప్రమాదం అంటే ఏమిటంటే ఏం చెబుతారు? ఏంటీ.. మాటల కోసం వెతుక్కుంటున్నారా! అంత అవసరం లేదండీ! ఈసారి నుంచి ఈ అమ్మాయి ఫొటోలు చూపించండి చాలు. ఆ... అక్కడెందుకు నిలబడిందో అంటారా... అయితే కథనం చదవండి...

దైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా.. అందమైన చోటు కనిపించినా సెల్ఫీ తీసుకుని, సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తాం. ఏంజెలా నికోలౌ కూడా అంతే. కానీ తనకు నచ్చేవన్నీ బాగా ఎత్తైన ప్రదేశాలే! కొండలు, టవర్లు, భవనాలు, స్కైస్కేపర్‌.. ఇలా ఏం కనిపించినా ఎక్కేసి, క్లిక్‌ మనిపించేస్తుంది. పైగా వాటి కోసం వెతుక్కుంటూ వెళ్తుంది.

ఏంజెలాది రష్యా. ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. మంచి ఫొటోల కోసం విభిన్న ప్రదేశాలకు వెళ్లేది. కొత్త విధాలుగా ప్రయత్నించేది. ఓసారి ఓ ఎత్తయిన భవంతి ఎక్కాల్సి వచ్చింది. తీరా అక్కడికి వెళ్లాక ఫొటోలు తీయ లేకపోయింది. ఆమెకు ఎత్తయిన ప్రదేశాలంటే భయం మరి! దాన్ని అధిగమించాలనే పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. ఇప్పుడదే వ్యాపకమైంది. అదే సమయంలో తను తీసే ప్రమాదకర సెల్ఫీలు ట్రెండ్‌గా మారాయి. దీంతో తన పోస్టులకు అభిమానులూ పెరిగిపోయారు.

ఇంకేముంది ప్రయోగాలు మొదలుపెట్టింది. ఇందుకు ఆమె స్నేహితుడు, ఫొటోగ్రాఫర్‌ ఇవాన్‌ కూడా తోడవ్వడంతో.. కేవలం నిల్చోవడానికే పరిమితం కాకుండా జిమ్నాస్టిక్‌, డ్యాన్స్‌ ఫోజులనూ ప్రారంభించింది. ఎత్తైన భవనం పిట్టగోడ, అతి పొడవైన స్తంభం మీద ఒంటి కాలిపై, శరీరాన్ని విల్లులా వంచుతూ ఆమె చేసే భంగిమలు చూసి భయపడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అమెరికా, చైనా, హాంగ్‌కాంగ్‌, ఫ్రాన్స్‌, శ్రీలంక వంటి ఎన్నో దేశాల్లోని ఎత్తైన కట్టడాలపైనా ప్రయోగాలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్నీ సంపాదించుకుంది. వీళ్లంతా తనను డేర్‌డెవిల్‌, వండర్‌ విమెన్‌, స్పైడర్‌ విమెన్‌, డేంజరస్‌ సెల్ఫీగర్ల్‌ అని పిలుచుకుంటారు. ఏంజెలా అభిమాన గణాన్ని చూసి ఎన్నో సంస్థలు ప్రచార కర్తగానూ ఎంచుకున్నాయి. అన్నట్టూ.. ఇవన్నీ చేస్తున్నా.. ఎక్కేటపుడు కానీ, ఫోజులు పెట్టేటపుడు కానీ ప్రత్యేక రక్షణ జాగ్రత్తలేమీ తీసుకోదు. రోజువారీ దుస్తుల్లోనే ఇవన్నీ చేసేస్తుంది. ఇప్పుడేమంటారు? ప్రమాదానికి చిరునామా అని ఒప్పుకున్నట్టేనా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్