ఆట తెచ్చిన అభిమానులు2.5 కోట్లు!

27 ఏళ్ల జంగ్‌హోఇయోన్‌... నిన్నమొన్నటివరకూ ఓ సాధారణ మోడల్‌. దక్షిణకొరియా ప్రజలకు మాత్రమే తెలిసిన అమ్మాయి. మరి ఇప్పుడు... నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న ‘స్వ్కిడ్‌ గేమ్‌’ సిరీస్‌ పుణ్యమాని రాత్రికిరాత్రే ప్రపంచ వ్యాప్త సెలబ్రిటీ అయిపోయింది.

Published : 09 Nov 2021 02:28 IST

27 ఏళ్ల జంగ్‌హోఇయోన్‌... నిన్నమొన్నటివరకూ ఓ సాధారణ మోడల్‌. దక్షిణకొరియా ప్రజలకు మాత్రమే తెలిసిన అమ్మాయి. మరి ఇప్పుడు... నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న ‘స్వ్కిడ్‌ గేమ్‌’ సిరీస్‌ పుణ్యమాని రాత్రికిరాత్రే ప్రపంచ వ్యాప్త సెలబ్రిటీ అయిపోయింది. మొన్నటివరకూ నాలుగు లక్షలమంది మాత్రమే అభిమానులున్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోకి ఆ సిరీస్‌ విడుదలైన నెలన్నరలోనే రెండున్నర కోట్ల మంది వచ్చి చేరారు. దాంతో లూయిస్‌ ఉయిటాన్‌, అడిడాస్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆమెను గ్లోబల్‌ ఫ్యాషన్‌ అంబాసిడర్‌గా నియమించు కున్నాయి. అవకాశాలిచ్చేందుకు లెక్కకు మించిన సంస్థలు క్యూలో ఉన్నాయి. నిజానికి నటిగా జంగ్‌కి ఏమీ అనుభవం లేదు. స్వ్కిడ్‌తోనే నటనలో ఓనమాలు మొదలుపెట్టినా తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకుంది. ‘స్వ్కిడ్‌లో నేను చేసిన కాంగ్‌ సే బయోక్‌ పాత్రకీ నాకూ కొన్ని పోలికలున్నాయి. అందుకే నటన రాకపోయినా అంతగా ఆ పాత్రలో లీనమయ్యానేమో! మోడల్‌గా ప్రపంచదేశాలు తిరుగుతూ కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉండేదాన్ని. అచ్చంగా కాంగ్‌ పాత్రలానే. కానీ ఆ ఒంటరితనమే నన్నింత శక్తిమంతంగా మార్చిందని చెప్పగలను’ అనే జంగ్‌కు అవకాశాలు వెల్లువెత్తడంతో ఇప్పుడు క్షణం తీరిక లేకుండా పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్