ఆకులూ.. కాన్వాసులే!

కళకు ఆకాశమే హద్దు అంటుంది లగ్మి మేనన్‌. దాన్ని ఏ ఒక్కదానికో పరిమితం చేయకూడదనుకునేది. అందుకే కనిపించిన ప్రతిదానిపైనా బొమ్మలు వేయాలనుకుంటుంది. అలా వస్తువుల నుంచి పండ్ల వరకు ప్రతిదానిపైనా ప్రయత్నించింది. కానీ అవన్నీ ఇప్పటివరకూ ఎందరో ప్రయత్నించినవే. ఏదైౖనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఈకలపై చేయాలన్న ఆలోచన వచ్చింది. వీటిమీద పెయింటింగ్‌ ఓ పట్టాన అతుక్కోదు.

Published : 26 Feb 2022 01:28 IST

ళకు ఆకాశమే హద్దు అంటుంది లగ్మి మేనన్‌. దాన్ని ఏ ఒక్కదానికో పరిమితం చేయకూడదనుకునేది. అందుకే కనిపించిన ప్రతిదానిపైనా బొమ్మలు వేయాలనుకుంటుంది. అలా వస్తువుల నుంచి పండ్ల వరకు ప్రతిదానిపైనా ప్రయత్నించింది. కానీ అవన్నీ ఇప్పటివరకూ ఎందరో ప్రయత్నించినవే. ఏదైౖనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఈకలపై చేయాలన్న ఆలోచన వచ్చింది. వీటిమీద పెయింటింగ్‌ ఓ పట్టాన అతుక్కోదు. ఓ సవాలులా తోచి ప్రయత్నించింది. చిన్న చిన్న బొమ్మల నుంచి మనుషుల చిత్రాలవరకూ గీస్తోంది. తర్వాత ఆకులపైనా ఇదే పరిస్థితి. ముడుచుకుపోయి పెయింటింగ్‌ అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. దానిపైనా పట్టు సాధించి, అవలీలగా వేసేస్తోంది. నిజానికి లగ్మికి చిత్రకళపై అవగాహన తక్కువ. స్కూలు స్థాయిలో ప్రత్యేక తరగతి ఉన్నా.. స్నేహితుల సాయంతో నెట్టుకొచ్చేసింది. ఈమెది కేరళ. లాక్‌డౌన్‌ సమయంలో ఏదైనా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఈ కళ ఆకర్షించింది. ఆన్‌లైన్‌ కోర్సు చేసి, బొమ్మలు గీసేది. తనకంటూ ప్రత్యేకత ఉండాలి కదా అనుకుని ఈకలు, ఆకులు, గింజలు.. ఇలా వివిధ రకాలపై ప్రయత్నిస్తోంది. తను గీసిన వాటిని ‘లచ్చూస్‌ లిటిల్‌ క్రియేషన్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేది. వాటికి ప్రశంసలు దక్కడమే కాదు.. తమకీ చేసివ్వమని కోరడమూ మొదలుపెట్టారు. దీంతో కొంత మొత్తం తీసుకొని చేసిస్తోంది. అన్నట్టూ.. ఈమె ప్రయత్నాలకి గుర్తింపూ దక్కింది. ఒకే ఈకపై ఆరుగురు స్వాతంత్య్ర సమరయోధులను అరగంటలో గీసి ఇండియా, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ చోటు దక్కించుకుంది. అభిరుచీ, ఆదాయమూ.. ఇంకా గుర్తింపు.. మంచి ఆలోచనేగా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్