బేబీ గార్డెన్‌... మహిళలకు మాత్రమే!

ముంబయిలోని బేబీగార్డెన్‌... నిత్యం ఆడవాళ్లు, పిల్లలతో సందడిగా ఉంటుంది. తల్లులు.. పిల్లలతో సమానంగా స్వేచ్ఛగా పరుగులు పెడుతూ ఆడుకుంటుంటే, కాస్త వయసు మళ్లిన వాళ్లు శరీరాన్ని కదిలించడానికి ఇబ్బందిగా ఉన్నా తోచిన వ్యాయామాలు చేస్తూ,

Published : 01 Apr 2022 01:26 IST

ముంబయిలోని బేబీగార్డెన్‌... నిత్యం ఆడవాళ్లు, పిల్లలతో సందడిగా ఉంటుంది. తల్లులు.. పిల్లలతో సమానంగా స్వేచ్ఛగా పరుగులు పెడుతూ ఆడుకుంటుంటే, కాస్త వయసు మళ్లిన వాళ్లు శరీరాన్ని కదిలించడానికి ఇబ్బందిగా ఉన్నా తోచిన వ్యాయామాలు చేస్తూ, కష్టసుఖాలు పంచుకుంటూ ఉంటారు. పిల్లలకు పాలిచ్చే బాలింతలూ ఉంటారు. అలా చేయడానికి అక్కడ వాళ్లకు ఏ మొహమాటమూ ఉండదు. మగవాళ్లు చూస్తారనే ఇబ్బందీ ఉండదు. ఎందుకంటే ఈ పార్కు ఆడవాళ్లకు ప్రత్యేకం కాబట్టి. ఉదయమో, సాయంత్రమో ఇక్కడకు వచ్చే ఆడవాళ్లంతా ఈ పార్కు పుణ్యమాని స్నేహ బంధాల్ని పెంచుకున్నారు. సోషల్‌మీడియాలో కాకుండా నిజమైన సోషల్‌ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ‘ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉన్నా ఎవరి ఇంట్లో వాళ్లే బందీలం. పొరుగింటి వాళ్లతో కూడా మాట్లాడటానికి లేకుండా తలుపులు బిడాయించుకుని ఉంటున్నాం. పోనీ కాసేపు అలా చల్లగాలికి సేదతీరుదామని బయటకు వెళ్తే ఆ ప్రదేశాలేవీ స్త్రీల కోసం కాదన్నట్టుగా మగవాళ్లతో రద్దీగా ఉంటాయి. జిమ్‌లు, సినిమాహాళ్లు ఇతర పబ్లిక్‌ ప్రదేశాలు ఎక్కడైనా అదే పరిస్థితి. పిల్లలతో ఆడుకుందామన్నా, తోటి ఆడవాళ్లతో స్వేచ్ఛగా ఉందామన్నా వీలుపడదు. గత ఏడాది  ఇందుకు సంబంధించి ఒక సర్వే జరిగితే అందులో దిల్లీ వంటి చోట్ల ఒంటరిగానే కాదు, అందరితో కలిసి కూడా ఆడవాళ్లు పార్కులకు రావడానికి ఇష్టపడటం లేదని తేలింది. దీనివల్ల నగరాల్లో మహిళలు పూర్తిగా ఒంటరితనానికి లోనవుతున్నారని మా అధ్యయనాల్లో తేలింది. ఇందుకు పరిష్కారంగానే ఈ బేబీగార్డెన్‌ని ఆడవాళ్లకి కేటాయించారు. కనీసం చాయ్‌వాలాలు కూడా ఈ పార్క్‌లో అడుగుపెట్టలేరు. విద్యార్థుల నుంచి పెద్దవాళ్లు వరకూ ఎంతో స్వేచ్ఛగా ఇక్కడకు రావడానికి అదే కారణం’ అంటున్నారు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌-ముంబయి ప్రొఫెసర్‌ విభూతిపటేల్‌. ప్రతి ఊళ్లోనూ ఇలాంటి ఓ పార్కుంటే బాగుంటుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్