అమ్మ కాబోతున్నామోచ్‌!

వెండితెరపై మెరిసినప్పుడే కాదు... మనసుకు నచ్చినవాడిని మనువాడే సెలబ్రిటీల సంతోషం కూడా అభిమానులకు సంబరమే. అందుకే తమ ఆనందాలను సెలబ్రిటీలు వారితో పంచుకుంటూ ఉంటారు. అలానే

Published : 16 Apr 2022 00:23 IST

వెండితెరపై మెరిసినప్పుడే కాదు... మనసుకు నచ్చినవాడిని మనువాడే సెలబ్రిటీల సంతోషం కూడా అభిమానులకు సంబరమే. అందుకే తమ ఆనందాలను సెలబ్రిటీలు వారితో పంచుకుంటూ ఉంటారు. అలానే తాము అమ్మ కాబోతున్న శుభవార్తని కళాత్మకంగా వెల్లడిస్తున్నారు. తమ బేబీ బంప్స్‌ను సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శిస్తూ.. తాము తీసుకుంటున్న పౌష్టికాహారం, చేస్తున్న వ్యాయామాలు, తల్లి, పుట్టబోయే బిడ్డ శారీరక, మానసికారోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కలిగించే ప్రయత్నమూ చేస్తున్నారు. ఇప్పుడా వరుసలో నటి కాజల్‌ అగర్వాల్‌, ప్రణీతా సుభాష్‌, సోనమ్‌కపూర్‌లు ఉన్నారు. గతంలో అనుష్కశర్మ, లారాదత్తా, కరీనాకపూర్‌, సోహాఅలీఖాన్‌, ఫ్రిదాపింటో వంటి వారు ఈ జాబితాలో ఉంటే, క్రీడాకారిణి సానియా సైతం బేబీ బంప్‌ను ప్రదర్శించి, కాబోయే తల్లులకు జాగ్రత్తలు కూడా వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్